BigTV English

Iran vs Israel: ఇజ్రాయెల్‌పై ఆ దాడి చేస్తేనే ఇరాన్ సేఫ్!? రంగంలోకి అమెరికా?

Iran vs Israel: ఇజ్రాయెల్‌పై ఆ దాడి చేస్తేనే ఇరాన్ సేఫ్!? రంగంలోకి అమెరికా?

Iran vs Israel: ఇరాన్‌కు చెక్ పెట్టేందుకు ఓవైపు ఇజ్రాయెల్, ఇంకోవైపు అమెరికా రెండూ చాలా వేగంగా సిద్ధమవుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ను చంపితేనే.. ఈ ఉద్రిక్తతలకు ముగింపు ఉంటుందన్న మాట బెంజమిన్ నెతన్యాహు అనడంతో.. యుద్ధం అనివార్యం అన్న పరిస్థితి వచ్చింది. ఇరాన్ కీలక సైనికాధికారులను వరుసగా ఎలిమినేట్ చేస్తూ వస్తున్న ఇజ్రాయెల్ బలగాలు.. ఫైనల్ టార్గెట్ కోసం రెడీగా ఉందా? మధ్యలో ట్రంప్ హడావుడి చేస్తుండడం, ఇరాన్‌కు వార్నింగ్‌లు ఇస్తుండడంతో మరో భీకర యుద్ధానికి టైమ్ వచ్చేసిందా? మూడో ప్రపంచ యుద్ధం జరిగేందుకు అడుగు దూరమే మిగిలి ఉందా? లెట్స్ వాచ్.


ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ముదిరిన యుద్ధం

బ్లాస్ట్.. బ్లాస్ట్.. బ్లాస్ట్.. ఎటు చూసినా పేలుళ్లే. ఇజ్రాయెల్, ఇరాన్ వార్ పీక్స్ కు వెళ్తోంది. రోజూ మిసైల్ ఎటాక్స్ తో రెండు దేశాలు దద్దరిల్లిపోతున్నాయి. రెండు దేశాలు సివిలియన్ ఏరియాలనూ టార్గెట్ చేసుకుంటున్నాయి. రెండు దేశాల్లోనూ ఎయిర్ రైడ్ సైరన్‌లు మోగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ చాలా ముందుంది. ఇరాన్ ను ఊపిరి తీసుకోనివ్వడం లేదు. రెండువైపులా యాక్షన్ రియాక్షన్స్ పెరుగుతున్నాయి.


జూన్ 13న మొదలైన ఆపరేషన్ రైజింగ్ లయన్

ఇరాన్ అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది. అస్త్రాలు అయిపోతున్నాయి కూడా. అటు ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాలను బ్రేక్ చేసేలా ఇజ్రాయెల్ భారీ మాస్టర్ స్ట్రాటజీతో వెళ్లింది. అణుస్థావరాలపై దాడులు చేసింది. అక్కడ ఇప్పట్లో ఎక్స్ పరిమెంట్స్ జరిగే పరిస్థితులు లేవు. అలాగే ఇరాన్ కు చెందిన కీలక న్యూక్లియర్ సైంటిస్టులను హతమార్చింది ఇజ్రాయెల్. జూన్ 13న మొదలైన ఆపరేషన్ రైజింగ్ లయన్ చాలా దూరం వెళ్తోంది. ఇది ఎప్పుడు ఆగుతుందో తెలియదు.

ప్రపంచ దేశాలు విడిపోతే మూడో ప్రపంచ యుద్ధమే

ఇజ్రాయెల్ ను ఇరాన్ ఎదుర్కోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. అదే అణ్వస్త్ర దాడి. లేకపోతే ఇరాన్ ప్యాకప్ అవుతుంది. ఇజ్రాయెల్ భయం కూడా అదే. అందుకే ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేసింది. మళ్లీ ఇరాన్ పుంజుకుని ఈ ప్రయోగాలు చేయాలంటే చాలా ఏళ్లు పడుతుందని నెతన్యాహు ఇప్పటికే ప్రకటించారు. యుద్ధం ముదిరితే అమెరికా కూడా రంగంలోకి దిగడం ఖాయమే. ఎందుకంటే ఇజ్రాయెల్ కు మద్దతుగా ఇరాన్ ను బెదిరిస్తున్నారు ట్రంప్. ఇంకోవైపు ఇరాన్ కూడా ఖతార్, ఒమెన్, పాకిస్తాన్, సౌదీ అరేబియా సహా ఇతర ఇస్లామిక్ దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉంది. సో ఇప్పుడు ప్రపంచ దేశాలు రెండు గ్రూపులుగా విడిపోతే మాత్రం ఇక మూడో ప్రపంచ యుద్ధమే..

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేసే ప్లాన్

నిజానికి బెంజమిన్ నెతన్యాహు కన్నంతా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేయడంపైనే ఉంది. అయితే ఈ ప్రయత్నాన్ని అమెరికా ఆపినట్లు తెలిసింది. ఖమేనీ హతమైతే.. పరిస్థితి భీకరంగా మారుతుందన్న ఉద్దేశంతోనే యుద్ధ వాతావరణాన్ని తగ్గించారా అన్నది కీలకంగా మారింది. అటు ఇరాక్, బహ్రెయిన్, ఇతర మిడిల్ ఈస్ట్ దేశాల నుండి అమెరికా దౌత్య సిబ్బంది, సైనిక కుటుంబాలను ఖాళీ చేయమని ట్రంప్ ఆదేశించారు. ఇరాన్ ప్రతీకార దాడుల్లో అమెరికన్లకు నష్టం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వాషింగ్టన్‌ స్ట్రాటజీ రూమ్‌లో వరుస రివ్యూలు

కెనడాలోని G7 సమావేశంలో ఇజ్రాయెల్ ఇరాన్ వార్ పై డిస్కస్ చేశారు. ఈ ఎపిసోడ్ లో ట్రంప్ వైఖరే అర్థంకాకుండా ఉంది. అప్పుడే ఇరాన్ కు వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే యుద్ధ విరమణపై ప్రతిపాదన చేస్తాడు. నిజానికి జీ7 సమ్మిట్ లోనూ ట్రంప్ అర్ధాంతరంగా బయటికొచ్చేసి.. వాషింగ్టన్‌లోని స్ట్రాటజీ రూమ్‌లో అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ టీమ్ తో సమావేశమయ్యారు. ఇదే ట్రంప్ జూన్ 15న ఇరాన్ పై పూర్తిస్థాయిలో దండెత్తుతామన్నారు. మధ్యలో మనకు ఈ యుద్ధం అవసరమా అని కొందరు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు అంటున్నారు.

ఇరాన్ కీలక ఆర్మీ కమాండ్ర్లు హతం

చెప్పాలంటే ఇరాన్ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ఫైటర్ జెట్స్ ఇతర ఆయుధ కేంద్రాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ధ్వంసమైపోయాయి. ఒక్కొక్క కీలక లీడర్లు నేలకొరుగుతున్నారు. ఇప్పుడు ఇరాన్ కు ఇతర ఇస్లామిక్ దేశాలు సపోర్ట్ గా వస్తే తప్ప ఆ దేశాన్ని కాపాడలేని పరిస్థితులు ఎదురయ్యాయి. అటు చైనా కూడా ఇజ్రాయెల్ దాడులను ఖండించింది. కచ్చితంగా అమెరికాకు అపోజిట్ టీమ్ లో డ్రాగన్ కంట్రీ ఉండబోతోంది. సో దేశాలన్నీ రెండుగా విడిపోతే కథ మరోలా ఉండబోతోంది. ఇరాన్ ఇలాగే రెచ్చిపోతే ట్రంప్ ఏదో ఒక కీలక నిర్ణయమైతే తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇరాన్ పై దాడి చేయాలనుకుంటే అమెరికా దగ్గర చాలా అస్త్రాలున్నాయ్. ఒకే రోజులో ఇరాన్ ఖేల్ ఖతం చేయడం ఖాయమే.

F-35 లైటనింగ్ 2 స్టెల్త్ ఫైటర్స్ ప్రయోగించే ఛాన్స్

F-35 లైటనింగ్ 2 స్టెల్త్ ఫైటర్స్ రాడార్‌ల నుంచి తప్పించుకుని, కచ్చితమైన దాడులు చేస్తాయి. ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు వీటినే వాడుతోంది. MQ-9 రీపర్ డ్రోన్లతో కచ్చితమైన టార్గెట్ ఐడెంటిఫై కోసం వాడే అవకాశం ఉంది. టామ్‌హాక్ క్రూయిజ్ మిస్సైళ్లతో దూరంగా ఉన్న టార్గెట్స్ ను కచ్చితత్వంతో చేదిస్తాయి. అమెరికా వీటిని ప్రయోగించే ఛాన్స్ ఉంది. అటు గైడెడ్ బాంబ్స్ ఉన్నాయి. సాధారణ బాంబులను GPS గైడెడ్ వెపన్స్ గా మార్చే కిట్లతో కచ్చితమైన అటాక్స్ చేస్తాయి. GBU-31 తో భూగర్భ స్థావరాలు, అణు స్థావరాలను ధ్వంసం చేయొచ్చు. అమెరికా బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్లను అడ్డుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇరాక్, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాల నుంచి హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ వంటి ఆయుధాలు వాడే అవకాశం అమెరికాకు ఉంది. సో అస్త్రాలకు లెక్కే లేదు. తట్టుకునేందుకు ఇరాన్ రెడీగా లేదన్నది వాస్తవం.

GBU-31 తో భూగర్భ స్థావరాలు, అణు స్థావరాల ధ్వంసం

ప్రస్తుతం ఇజ్రాయెల్ ఎటాక్స్ తో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ.. ఇరాన్ అతిపెద్ద యురేనియం ఫీల్డ్ కు తీవ్ర నష్టం జరిగినట్లు చెప్పింది. అటు ఇరాన్ లో పరిస్థితులు దారుణంగా మారడం, జనాలు ప్రాణభయంతో వలసలు వెళ్తుండడంతో భారత్ కూడా అలర్ట్ అయింది. 24×7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ పెట్టింది. ఇరాన్ లో ఉన్న ఇండియన్లను తరలిస్తోంది. సో ఈ యుద్ధంలో ఇప్పటిదాకా ఇరాన్ లో 224 మంది చనిపోగా, ఇజ్రాయెల్‌లో 24 మంది చనిపోయారు. ఇరాన్ ఆయిల్, గ్యాస్ ఫీల్డ్స్ పై దాడులతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయి.

Related News

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

Big Stories

×