BigTV English

Vijay-Rashmika: కారులో అడ్డంగా దొరికిపోయిన ప్రేమ జంట.. కెమెరాలకు చిక్కకుండా ?

Vijay-Rashmika: కారులో అడ్డంగా దొరికిపోయిన ప్రేమ జంట.. కెమెరాలకు చిక్కకుండా ?

Vijay-Rashmika: సోషల్ మీడియా.. ప్రస్తుతం సెలబ్రిటీలను వెంటాడే పెద్ద భూతం. ఇది వచ్చాకా వారి పర్సనల్ లైఫ్ లో ఏది సీక్రెట్ గా చేయలేకపోతున్నారు. ఎక్కడకు వెళ్లినా ఫొటోస్, వీడియోస్ తీయడం, వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. దీనివలన వారు వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోతున్నారు. ఇంకోపక్క సెలబ్రిటీలు కూడా ఇవన్నీ ఉంటాయని తెలిసి కూడా కావాలనే కెమెరాకంటికి చిక్కుతారు. తాజాగా ఒక ప్రేమ జంట మరోసారి అడ్డంగా కెమెరా  కంటికి చిక్కింది. ఆ జంట ఎవరో కాదు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక.  గత కొన్నేళ్లుగా ఈ జంట ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.


 

ఛలో సినిమాతో రష్మిక.. తెలుగుతెరకు పరిచయమైంది. ఆ సినిమా చేసే సమయానికే కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇక ఛలో సినిమా తరువాత రష్మిక.. విజయ్ దేవరకొండతో కలిసి గీతగోవిందం సినిమా చేసింది. ఆ సెట్ లోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇక సినిమాలో వీరిద్దరి మధ్య రొమాన్స్, కిస్ లు.. నెక్స్ట్ లెవెల్ కెమిస్ట్రీ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా తరువాత.. ఏమైందో ఏమో తెలియదు కానీ రష్మిక.. రక్షిత్ తో చేసుకున్న ఎంగేజ్ మెంట్ ను క్యాన్సిల్ చేసుకుంది. దానికి కారణం విజయ్ దేవరకొండ అనే వార్తలు వినిపించాయి. అందులో నిజమెంత అనేది తెలియదు కానీ, ఆ  తరువాత రష్మిక నేషనల్ క్రష్ గా మారిపోయింది.


Viswambhara: ఇదెక్కడి విడ్డూరం అమ్మా.. మెగాస్టార్ కు ఐటెంగర్ల్ దొరకడం లేదా ?

 

ఇక గీతగోవిందం సెట్ లో విజయ్ – రష్మిక పరిచయం.. ప్రణయంగా మారిందని వార్తలు వచ్చాయి. ఇప్పటికీ వీరు రిలేషన్ లో ఉన్నారని టాక్ నడుస్తోంది. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు.. చాలాసార్లు వీరిద్దరూ కలిసి కెమెరాలకు చిక్కారు. వెకేషన్స్, టూర్స్, ఫెస్టివల్స్.. ఇలా ఎక్కడ చూసినా ఈ జంట కలిసే కనిపించేవారు. ఇద్దరు కలిసి కనిపించకుండా.. ఒక్కొక్కరు సపరేట్ గా ఫోటోలను పోస్ట్ చేసినా.. ఆ బ్యాక్ గ్రౌండ్ ను చూసి నెటిజన్స్ ఇట్టే కనిపెట్టేస్తున్నారు.

 

ఇంకా చెప్పాలంటే కావాలనే ఈ జంట అలాంటి ఫోటోలను పెట్టి మరింత హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు అని చెప్పొచ్చు. విజయ్ గురించి రష్మికను అడిగిన ప్రతిసారి ఆమె ముఖంలో వచ్చే సిగ్గు.. అతని గురించి మాట్లాడే విధానం వీరు రిలేషన్ లో ఉన్నారని చెప్పకనే చెప్తున్నాయి. మొన్న కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ నుంచి ఒక క్వాలిటీ తీసుకోవాలంటే ఏం తీసుకుంటారు అని అడిగితే.. విజయ్ నుంచి మొత్తం తీసేసుకుంటాను అని చెప్పి తన ప్రేమను చూపించింది రష్మిక. ఇంకోపక్క విజయ్ సైతం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయితోనే ప్రేమలో ఉన్నాను అని నిర్మొహమాటంగా చెప్పుకొచ్చాడు.

 

ఇలా హింట్స్ ఇవ్వడమే తప్ప డైరెక్ట్ గా ఈ జంట అధికారికంగా ప్రేమను బయటకు చెప్పడం లేదు. తాజాగా మరోసారి విజయ్ – రష్మిక జంటగా కనిపించి కెమెరా కంట పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ముంబై ఎయిర్ పోర్టులో వీరిద్దరూ కలిసి ఒకే కారులో వెళ్లడం ఫొటోగ్రాఫర్లు క్లిక్ మనిపిస్తుంటే.. కెమెరాకు చిక్కకుండా రష్మిక ముఖాన్ని కవర్ చేసుకోవడం ఆ వీడియోలో కనిపించింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఇంకెందుకు దాస్తారో.. అంత ప్రేమ ఉంటే డైరెక్ట్ గా చెప్పేస్తే అభిమానులు అయినా ఆనందిస్తారుగా అని కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×