BigTV English

Vitamin D Sunlight: విటమిన్ డి కోసం ఎండలో ఎంతసేపు ఉండాలి.. నిపుణుల సమాధానమిదే

Vitamin D Sunlight: విటమిన్ డి కోసం ఎండలో ఎంతసేపు ఉండాలి.. నిపుణుల సమాధానమిదే

Vitamin D Sunlight| విటమిన్ డి శరీరానికి చాలా ముఖ్యం. ఈ ముఖ్యమైన విటమిన్ లోపం వల్ల ఎముకలు, కీళ్ల నొప్పి ఎక్కువవుతుంది. రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. ఈ లోపం ఉంటే శరీరం వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. విటమిన్ డి లోపాన్ని తగ్గించడానికి, నిపుణులు ప్రతి ఉదయం సూర్యకాంతిని (ఎండ) తీసుకోవాలని సలహా ఇస్తారు. సూర్యకాంతి ద్వారా విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. కానీ, సూర్యకాంతిని సరిగ్గా ఎలా తీసుకోవాలి? ఎప్పుడు? ఎంత సమయం తీసుకోవాలో చాలామందికి తెలియదు. శరీరంలో ఏ భాగం సూర్యకాంతి నుండి ఎక్కువ విటమిన్-డి ని గ్రహిస్తుందో నిపుణలు వెల్లడించారు.


సూర్యకాంతి నుండి విటమిన్ డి పొందే సరైన విధానం
కొందరు విటమిన్-డి పొందడానికి ఎండలో ఎక్కువ ఎక్కువ సమయం గడుపుతారు. ఇది చాలా తప్పు. ఇలా చేయడం వల్ల చర్మం మందగించవచ్చు లేదా పూర్తి ప్రయోజనం పొందలేరు. కొందరు సూర్యకాంతిని కళ్లతో చూడడం ద్వారా విటమిన్ డి వస్తుందని అనుకుంటారు, కానీ అది కూడా తప్పు. సూర్యరశ్మి చర్మంపై పడినప్పుడు.. శరీరం స్వయంగా విటమిన్ డి ని ఉత్పత్తి చేస్తుంది.

సూర్యకాంతి నుండి విటమిన్-డి ఎలా పొందాలి?
సూర్యకాంతిలో కూర్చునేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. రోగనిరోధక వక్తి నిపుణుడు, క్యాన్సర్ ఇమ్యూనోథెరపిస్ట్ డాక్టర్ ఎ జమాల్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేశారు. అందులో సూర్యకాంతిని సరిగ్గా తీసుకునే విధానాన్ని వివరించారు. విటమిన్-డి కళ్ల ద్వారా లేదా సూర్యకాంతిని చూడడం ద్వారా రాదని ఆయన చెప్పారు. చర్మం ఎంత ఎక్కువ సూర్యకాంతిని తాకుతుందో, అంత ఎక్కువ విటమిన్ డి శరీరం పొందుతుంది. ముఖ్యంగా నడుము భాగం సూర్యకాంతి నుండి ఎక్కువ విటమిన్-డి ని గ్రహిస్తుంది. అందుకే, సూర్యకాంతిలో కూర్చునేటప్పుడు నడుముపై కాంతి పడేలా చూసుకోవాలి. నడుము బహిరంగంగా ఉంటే చాలా మంచిది, లేకపోతే సన్నని తెల్లని మల్మల్ బట్టతో శరీరాన్ని కప్పుకోవచ్చు. తెల్లని బట్ట లేదా వస్త్రం ఉపయోగించడం ఉత్తమం.


Also Read: షుగర్ కంట్రోల్ చేసేందుకు స్మూతీ.. ఉదయం టిఫిన్‌లో ఇలా చేసుకోండి

ఉదయం  ఎండలో ఎంత సమయం గడపాలి?
సూర్యరశ్మి చర్మంపై పడినప్పుడు, శరీరంలో పోషకాలు విచ్ఛిన్నమై విటమిన్-డి ఉత్పత్తి అవుతుంది. ఉదయం 15 నిమిషాల పాటు సూర్యకాంతిలో గడపడం ద్వారా తగినంత విటమిన్ డి పొందవచ్చు. వేసవిలో ఉదయం 8 గంటల లోపు, శీతాకాలంలో ఉదయం 9 గంటల లోపు సూర్యకాంతిని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డి సులభంగా అందుతుంది.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×