Nasrallah Funarals : ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించిన దాదాపు ఐదు నెలల తర్వాత, హిజ్బుల్లా మాజీ నాయకుడు హసన్ నస్రల్లా అంత్యక్రియల బీరుట్‌లోని ఓ స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది హిజ్బుల్లా మద్ధతుదారులు హాజరయ్యారు. ఇజ్రాయెల్‌తో 14 నెలల యుద్ధంలో ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా తాము శక్తివంతంగా ఉన్నారని చూపించడానికి హిజ్బుల్లా తన మద్దతుదారులకు అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చింది.
ఇజ్రాయిలో యుద్ధం మొదలైన తర్వాత తన శత్రువులందర్నీ తుదముట్టించిన ఇజ్రాయిల్.. లెబనీస్ రాజధాని దక్షిణ శివారులోని ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయంపై జరిపిన భారీ వైమానిక దాడిలో నస్రల్లా మరణించాడు. ఈయన మరణంతో హెజ్బొల్లాకు భారీ దెబ్బ తగిలింది. ఈ ఉగ్రవాద ముఠాను మధ్య ప్రాచ్యంలోనే శక్తివంతంగా మార్చాడు. ఇస్లాం ఉగ్రవాద సంస్థ అయిన హిజ్బుల్లా వ్యవస్థాపకులలో ఒకడైన నస్రల్లా 30 ఏళ్ల పాటు ఆ సంస్థకు అధిపతిగా ఉన్నాడు.
నస్రల్లా బంధువు, హెజ్‌బొల్లా తర్వాతి వారసుడిగా భావించిన హషీమ్ సఫీద్దీన్‌కూ ఈ చివరి కార్యక్రమంలో తుదివీడ్కోలు పలకనున్నారు. ఇరువురికి నివాళులు అర్పించేందుకు వచ్చిన వేలాది మందితో బీరూట్‌లోని స్టేడియం కిక్కిరిసిపోయింది. గతేడాది జరిపిన దాడుల్లో నస్రల్లాతో పాటు రాన్ రివల్యూషనరీ గార్డ్ దళానికి చెందిన డిప్యూటీ కమాండర్ జనరల్ అబ్బాస్ నీలోఫరసన్ తదితరులు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని రోజులకు మరో దాడిలో సఫీద్దీన్ సైతం మృతి చెందారు. అప్పట్లో ఇద్దరిని తాత్కాలికంగా రహస్య ప్రదేశాల్లో ఖననం చేశారు. వారికి అధికారిక అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ ఇటీవల హెజ్‌బొల్లా ప్రకటించింది. ఈ క్రమంలోనే బీరూట్‌లో నస్రల్లాను, సఫీద్దీన్‌ను దక్షిణ లెబనాన్‌లోని ఆయన స్వస్థలంలో ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రజల సందర్శనార్థం ఆదివారం వారి శవపేటికలను బీరూట్‌లోని స్టేడియానికి తరలించింది.
ఇజ్రాయిల్ ఫైటర్ జెట్ల గర్జన
ఓ వైపు ఈ కార్యక్రమం జరుగుతుండగా.. లెబనాన్ గగనతలంలో ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. లక్షల మంది హెజ్బొల్లా మద్ధతదారుల సమక్షంలో.. వారి అధిపతుల్ని చంపిన ఇజ్రాయిల్ గగనతలంలో గర్జన చేసిందని.. ఆ దేశ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి కాట్జ్.. తమ దేశం జోలికొస్తే ఎవరికైనా ఇదే పరిస్థితి ఎదురవుతుందనే సందేశాన్ని చాటేందుకే తమ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయని వెల్లడించారు. అంతకు ముందు దక్షిణ, తూర్పు లెబనాన్‌లోని ఆయుధ నిల్వల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
విదేశాల నుంచి వచ్చిన మద్ధతుదారులు
లెబనీస్ అధికారుల అంచనా ప్రకారం నస్రల్లా అంత్యక్రియలకు 4,50,000 మంది హజరయ్యారు. ఇంకా ఇంతమంది మద్ధతుదారులతో హెజ్బొల్లా బలంగానే ఉందని, ఎప్పటికైనా పుంజుకుంటుందనే సంకేతాన్ని ఇస్తుందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది కార్యకర్తలతో పాటు 65 దేశాల నుంచి దాదాపు 800 మంది ప్రముఖులు అంత్యక్రియలకు హాజరవుతారని అంతకు క్రితమే హిజ్బుల్లా సీనియర్ అధికారి అలీ దామౌష్ ప్రకటించారు. లెబనాన్ రాజధానిలోని ప్రధాన క్రీడా స్టేడియంకు చేరుకున్న అధికారులలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ ఖలీబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి ఉన్నారు. లెబనాన్ పార్లమెంట్ స్పీకర్, అధ్యక్షుడు, ప్రధానమంత్రి ప్రతినిధులు కూడా హాజరయ్యారు.
Also Read : Bulldozer in wedding : పెళ్లిలోకి డజనుకు పైగా బుల్డోజర్లు – ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఊరి జనం