BigTV English

Pushpa 2 The Rule Trailer: ఆల్ టైం రికార్డ్ బ్రేక్ చేసిన పుష్పరాజ్.. ప్రత్యర్ధులకు చెమటలే..!

Pushpa 2 The Rule Trailer: ఆల్ టైం రికార్డ్ బ్రేక్ చేసిన పుష్పరాజ్.. ప్రత్యర్ధులకు చెమటలే..!

Pushpa 2 The Rule Trailer: ‘గంగోత్రి’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై, ఇప్పుడు ఐకాన్ స్టార్ గా పేరు దక్కించుకున్నారు. తాజాగా అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన చిత్రం పుష్ప 2 (Pushpa-2). సుకుమార్ (Sukumar)దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న(Rashmika Mandanna)హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న ‘మైత్రి మూవీ బ్యాక్ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. గత రెండేళ్లుగా ఆడియన్స్ ని ఊరిస్తూ.. హైప్ క్రియేట్ చేసిన చిత్ర బృందం, తాజాగా ఈ సినిమాని విడుదలకు సిద్ధం చేసింది.


ఘనంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్..

డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుండి నవంబర్ 17 అనగా నిన్న సాయంత్రం బీహార్ లోని పాట్నాలో గాంధీ మైదాన్ లో ఒక పెద్ద సెట్ ఏర్పాటు చేసి, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేశారు. ఇక ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. చాలామంది అభిమానులు ఈ ఈవెంట్ కి విచ్చేసి, చిత్ర బృందాన్ని సంతోషపరిచారు. ఇకపోతే ఇందులో రష్మిక మందన్న, అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా అటు నార్త్ లో బన్నీ మేనియా, క్రేజ్ కు మరింత పాపులారిటీ లభించింది.


ఇప్పటివరకు 100 మిలియన్ వ్యూస్..

ఇదిలా ఉండగా ట్రైలర్ తోనే రికార్డుల వేట మొదలుపెట్టింది ఈ సినిమా. ట్రైలర్ రిలీజ్ అయిన 15 గంటల్లోనే హైయెస్ట్ వ్యూస్ అందుకున్న ట్రైలర్ గా రికార్డు సృష్టించింది. ఇకపోతే మహేష్ బాబు (Maheshbabu ) ‘గుంటూరు కారం’ ట్రైలర్ మీద ఇప్పటివరకు ఇలాంటి రికార్డులు ఉండేవి. అయితే ఈ ట్రైలర్ కి 38 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కానీ పుష్ప – 2 ట్రైలర్ కి 15 గంటల్లోనే 40 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకి 100 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు సమాచారం.

మహేష్, ప్రభాస్ రికార్డులను బ్రేక్ చేసిన బన్నీ..

ఇదిలా ఉండగా.. మహేష్ బాబు ‘గుంటూరు కారం’, ప్రభాస్ (Prabhas) ‘సలార్’ ట్రైలర్ ల రికార్డులను కూడా పుష్ప -2 ట్రైలర్ బ్రేక్ చేసింది. ఇప్పటికే తెలుగు, హిందీలో ట్రైలర్ వ్యూస్ చూస్తే 100 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ ట్రైలర్ చరిత్ర సృష్టించేలా కనిపిస్తోంది.

ఇకపోతే భాషల వారీగా ఇప్పటి వరకు ట్రైలర్ కు ఎన్ని వ్యూస్ వచ్చాయి అనే విషయానికి వస్తే..

తెలుగు -43,658,026 వ్యూస్
హిందీ – 38,664,330 వ్యూస్
కన్నడ -1,692,397 వ్యూస్
మలయాళం -1,830,709 వ్యూస్
బెంగాలీ – 482,562 వ్యూస్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ప్రత్యర్ధులకు చుక్కలు చూపించనున్న బన్నీ..

ఇక 24 గంటలు ముగిసేసరికి కచ్చితంగా 150 మిలియన్ వ్యూస్ రాబడుతుంది అనడంలో సందేహం లేదు. ఇకపోతే ఈ ట్రైలర్ సెట్ చేసిన రికార్డులను ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ మాత్రమే కాదు ఆల్ ఓవర్ ఇండియా హీరోస్ బ్రేక్ చేయడం కష్టమే అని చెప్పడంలో సందేహం లేదంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఇప్పటివరకు బన్నీని ఒంటరి చేసి కామెంట్లు చేసిన ప్రత్యర్థులకు ఈ ట్రైలర్ సృష్టించిన రికార్డులు చూస్తే చెమటలు పట్టడం ఖాయం అంటూ కూడా కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×