BigTV English

Kamala Harris | ‘గాజా యుద్ధం ముగించాల్సిందే..’ ఇజ్రాయెల్ ప్రధానితో కమలా హ్యారిస్

Kamala Harris | ‘గాజా యుద్ధం ముగించాల్సిందే..’ ఇజ్రాయెల్ ప్రధానితో కమలా హ్యారిస్

Kamala Harris | హమాస్‌తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ వేల సంఖ్యలో అమాయక పౌరులు ముఖ్యంగా చిన్నారులు, మహిళలను చంపుతోంది. గాజాలో జీవనం నరకంగా మారింది. ప్రపంచ దేశాలు ఎంత చెప్పినా ఇజ్రాయెల్ ఆత్మరక్షణ పేరుతో రక్తపాతం చేస్తూనే ఉంది. ఈ స్థాయిలో మరో దేశం మారణకాండ సాగించి ఉంటే.. అమెరికా ఎప్పుడో అడ్డుపడేది. కానీ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అమెరికా మిత్రదేశం కాబట్టి అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ఏం చేసినా కాపాడుతున్నారు.


కానీ జో బైడెన్ పదవికాలం ఈ సంవత్సరం ముగియనుంది. ఆ స్థానంలో డెమొక్రాట్స్ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయబోతున్న కమలా హ్యారిస్ మాత్రం ఇజ్రాయెల్ పట్ల వ్యతిరేకంగానే ఉన్నారు. అమెరికా పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఆమె ఇటీవల భేటీ అయ్యారు. ఆ తరువాత జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ”ఇజ్రాయెల్ రక్షణకు పూర్తిగా మద్దతు చేస్తాను.. కానీ గత తొమ్మిది నెలలుగా జరుగుతున్న వినాశనాన్ని సమర్థించలేను. అందుకే యుద్ధం వీలైనంత త్వరగా ముగించేందుకు ప్రయత్నం చేయాలి. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న వారిని విడిపించాలి. దీనికోసం గాజా యుద్దం శాశ్వతంగా ముగించాల్సిందే,” అని సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

”గాజాలో అమాయక ప్రజలు చనిపోవడం చూసి.. నిర్లక్ష్యంగా ఉండలేము. వారి దుర్భర జీవనం చూసి నేను మౌనంగా ఉండను” అని తన ధోరణి స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలు విన్న తరువాత అమెరికా రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఒకవేళ హ్యరిస్ తదుపరి అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నికైతే.. ఇజ్రాయెల్ ప్రధానితో ఆమె కఠినంగా వ్యవహరిస్తారా? అని సందేహాలు మొదలయ్యాయి. కానీ విశ్లేషకులు మాత్రం అలాంటిదేమి జరగదని.. అమెరికా ఎప్పటి నుంచే ఇజ్రాయెల్ పక్షన నిలబడిందని.. ముందు కూడా అలానే కొనసాగుతుందని చెబుతున్నారు.


Also Read: నేను ఓడిపోతే మూడో ప్రపంచ యుద్ధమే.. ఇజ్రాయెల్ ప్రధానితో ట్రంప్

మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. కమలా హ్యారిస్ తో భేటీ ముగిసిన తరువాత ఆమె ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ తో సమావేశమయ్యారు. అయితే ట్రంప్ నెతన్యాహుతో కలిసిన తరువాత.. కమల హ్యారిస్ పై తీవ్ర విమర్శలు చేశారు. కమలా హ్యారిస్ యూదులకు వ్యతిరేకం.. ఇజ్రాయెల్ కు వ్యతిరేకం.. ఆమె తదుపరి ప్రెసిడెంట్ అయితే ఇజ్రాయెల్ ఎన్నో యుద్దాలు చేయాల్సి వస్తుంది. కానీ తాను ప్రెసిడెంట్ గా ఎన్నికల్లో విజయం సాధిస్తే.. యుద్ధాలు త్వరగా ముగిసిపోతాయని అన్నారు.

ఎలా చూసినా ఇద్దరు అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థులు యుద్ధం ముగించాలనే మాట్లాడుతున్నారు. ఈ విషయం ఇజ్రాయెల్ నచ్చకపోవచ్చు.. అందుకే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇజ్రాయెల్ కు కూడా కీలకంగా మారాయి.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×