BigTV English

Gurupatwant Singh Pannun | భారత పార్లమెంటుపై త్వరలో బాంబు దాడి చేస్తాం : ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూన్

Gurupatwant Singh Pannun | అమెరికా సంరక్షణలో ఉన్న ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. డిసెంబర్ 13 లేదా అంతకంటే ముందే భారత పార్లమెంటుపై దాడి చేస్తామని చెబుతూ ఒక వీడియో విడుదల చేశాడు.

Gurupatwant Singh Pannun | భారత పార్లమెంటుపై త్వరలో బాంబు దాడి చేస్తాం : ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూన్

Gurupatwant Singh Pannun | అమెరికా సంరక్షణలో ఉన్న ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. డిసెంబర్ 13 లేదా అంతకంటే ముందే భారత పార్లమెంటుపై దాడి చేస్తామని చెబుతూ ఒక వీడియో విడుదల చేశాడు.


అమెరికా, కెనెడా పౌరసత్వమున్న పన్నూన్‌పై ఇటీవల అమెరికాలో హత్యాయత్నం జరిగింది. అయితే అమెరికా ప్రభుత్వానికి ముందుగానే దీని గురించి తెలిసిపోవడంతో అతను బతికిపోయాడు. ఇదంతా భారత ప్రభుత్వమే చేసిందని.. అమెరికా.. భారతదేశాల మధ్య వాదోపవాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పన్నూన్ ఒక వీడియో విడుదల చేశాడు. తనపై జరిగిన హత్యయత్నానికి ప్రతీకారంగా డిసెంబర్ 13న పార్లమెంటు కొత్తభవనాన్ని పేల్చేస్తామని అన్నాడు.

“2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై అఫ్జల్ గురు అనుచరులు దాడి చేశాడు. సరిగా అలాగే నేను కూడా 2023 డిసెంబర్ 13 పార్లమెంటు దాడి చేస్తాను.. కానీ ఈ దాడి ఇంకా భయంకరంగా ఉంటుంది. భారత పార్లమెంటు పునాదులు కదిలిపోతాయి. ఢిల్లీ బనేగా ఖలిస్తాన్” అని పన్నూన్ ఈ వీడియోలో అన్నాడు. వీడియోలో అతని వెనుక పాకిస్తాన్ ఉగ్రవాది అఫ్జల్ గురు పార్లమెంటు ఫొటో పోస్టర్ ఉంది. ఆ పోస్టర్‌పై ‘ఢిల్లీ బనేగా ఖలిస్తాన్’ అనే శీర్షిక అని రాసి ఉంది.


పన్నూన్ ఇంతకు ముందు ప్రపంచ కప్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ రోజున కూడా ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చేస్తానని బెదిరించాడు. కానీ అది జరగలేదు. కానీ ఈ సారి అతను సీరియస్‌గా ప్రయత్నిస్తున్నాడని నిఘా వర్గాల సమాచారం అందించాయి. దాడిని అమలు చేయడానికి కొందరు వక్తులను ఉగ్రవాది పన్నూన్ నియమిస్తున్నట్లు తెలిపాయి.

ప్రస్తుతం పార్లమెంటు శీతకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఉగ్ర దాడి బెదిరింపులు రావడంతో భద్రతా ఏజెన్సీలు ఒక్కసారి అప్రమత్తమయ్యాయి.

Related News

New York Bus Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Earthquake: సౌత్ అమెరికాను కుదిపేసిన భారీ భూకంపం.. 7.5గా నమోదు

Karachi city: జలదిగ్బంధంలో కరాచీ సిటీ.. వెంటాడుతున్న వర్షాలు, నిలిచిన విద్యుత్, ఆపై అంధకారం

America Tariffs: రష్యాపై ఒత్తిడికోసమే భారత్ పై సుంకాల మోత.. అసలు విషయం ఒప్పుకున్న అమెరికా

Spain Wildfires: స్పెయిన్‌లో కార్చిచ్చు.. 20 ప్రాంతాలకు విస్తరిస్తున్న మంటలు.. ఇదిగో వీడియో..

Afghanistan: బస్సులో చెలరేగిన మంటలు.. 71 మంది సజీవదహనం!

Big Stories

×