Big Stories

T20 : ఆసీస్ కు షాకిచ్చిన కివీస్…

- Advertisement -

T20 : T20 వరల్డ్ కప్ సూపర్ 12 తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది… న్యూజిలాండ్. ఏకంగా 89 పరుగుల తేడాతో సూపర్ విక్టరీకొట్టింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో కివీస్ దెబ్బకు ఆస్ట్రేలియా టీమ్ కంగారెత్తిపోయింది. ముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్… 20 ఓవర్లలో సరిగ్గా 200 పరుగులు చేసింది. 201 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా… పూర్తిగా 20 ఓవర్లు ఆడకుండానే 111 పరుగులకు ఆలౌట్ అయింది.

- Advertisement -

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్ కు… ఆ నిర్ణయం తప్పని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వాళ్లిద్దరి వీరబాదుడుకు 4 ఓవర్లు పూర్తికాకముందే న్యూజిలాండ్ స్కోరు 50 పరుగులు దాటింది. 16 బంతుల్లోనే 42 రన్స్ చేసిన అలెన్ ఐదో ఓవర్లో ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్… ధాటిగా ఆడుతున్న కాన్వేకు పూర్తి సహకారం అందించాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 69 రన్స్ జోడించారు. 23 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర విలియమ్సన్ ఔటైనా… కాన్వే ఏ మాత్రం దూకుడు తగ్గించలేదు. 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కాన్వే… మరో 22 బంతుల్లో 42 రన్స్ చేశాడు. మ్యాచ్ పూర్తయ్యే సమయానికి 58 బంతుల్లో 92 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. చివర్లో జేమ్స్ నీషమ్ 13 బాల్స్ లోనే 26 రన్స్ బాదేయడంతో… సరిగ్గా 20 ఓవర్లకు 200 రన్స్ చేసింది… న్యూజిలాండ్.

201 రన్స్ టార్గెట్ గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు.. రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ వార్నర్ కేవలం 5 రన్స్ మాత్రమే చేసి ఔటయ్యాడు. మిగతా బ్యాటర్లు కూడా ధాటిగా ఆడే ప్రయత్నంలో వికెట్లు సమర్పించుకున్నారు. మాక్స్ వెల్, పాట్ కమిన్స్ మినహా ఆసీస్ టీమ్ లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఆ జట్టులో ఒక బ్యాటర్ డకౌట్ గాకా… ఐదుగురు బ్యాటర్లు డబల్ డిజిట్ స్కోరు కూడా చేయలేదు. క్రమం తప్పకుండా వికెట్లు పడిపోవడంతో… చివరికి 17.1 ఓవర్లకే 111 పరుగుల వద్ద ఆసీస్ ఆలౌటైంది. ఏకంగా 89 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది. 92 పరుగులు చేయడంతో పాటు రెండు క్యాచ్ లు పట్టిన కివీస్ ప్లేయర్ డెవాన్ కాన్వేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News