BigTV English

KA Paul : మునుగోడులో ‘పాల్’ హల్ చల్.. హామీలు వింటే అవాక్కవ్వాల్సిందే..

KA Paul : మునుగోడులో ‘పాల్’ హల్ చల్.. హామీలు వింటే అవాక్కవ్వాల్సిందే..

KA Paul : ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం. మండలానికి వెయ్యి ఉద్యోగాలు. గెలిస్తే ఆరు నెలల్లోనే హాస్పిటల్, యూనివర్సిటీ కట్టిస్తా.. మునుగోడును అమెరికా చేస్తా.. ఇలా సాగుతున్నాయి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి కేఏ పాల్ హామీలు. పొలిటికల్ కమెడియన్ గా ఫుల్ పాపులారిటీ ఉన్న పాల్.. ఈసారి ఏపీ నుంచి వచ్చి మునుగోడులో ఎంట్రీ ఇచ్చారు. ఉప ఎన్నికల్లో ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఏదో నామినేషన్ వేసామా.. పని అయిపోయిందా.. అన్నట్టు కాకుండా.. ప్రధాన పార్టీలకు ధీటుగా సీరియస్ గా ప్రచారం చేస్తున్నారు. హోటల్ లో దోసలు వేయడం, ప్రజలతో మాట్లాడటం, ఫోటోలకు ఫోజులు ఇవ్వడం.. అబ్బో యమా జోరుగా నడుస్తోంది పాల్ ప్రచారం. ఇక, ఆయన వెంటే ఆయన కోడలు మరింత స్పెషల్ అట్రాక్షన్.


కేఏ పాల్ మాటల గురించి తెలిసిందేగా. నవ్వకుండా ఉండలేరు. హామీలు, ఆసక్తికర వ్యాఖ్యలతో తానే గట్టి పోటీదారుడిననేలా తెగ బిల్డప్ ఇస్తున్నారు. తమ పార్టీ తరఫున ఏకంగా ప్రజాయుద్ధనౌక గద్దర్ నే బరిలో దింపుతున్నట్టు పబ్లిసిటీ ఇచ్చి.. చివరికి గద్దర్ హ్యాండ్ ఇచ్చారంటూ.. తానే నామినేషన్ వేసి సంచలనంగా నిలిచారు. అప్పటి నుంచి మునుగోడులో, మీడియాలో హల్ చల్ గా మారారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా సరైన కవరేజ్ ఇవ్వడం లేదుగానీ.. మనోడి సెల్ఫ్ ప్రమోషన్ మామూలుగా లేదు. మునుగోడులో పోటీ చేస్తున్న 27 మంది అభ్యర్థులు తనకే మద్దతు పలుకుతున్నారని.. బడుగు, బలహీన వర్గాల సపోర్ట్ కూడా తనకే ఉందని అంటున్నారు.

ఎన్నికల గుర్తుపైనా పాల్ తనదైన స్టైల్ లో కామెంట్లు చేస్తున్నారు. తాను హెలికాప్టర్ సింబల్ అడిగితే.. ఉంగరం గుర్తు ఇచ్చారని.. అందుకే తాను రిటర్నింగ్ అధికారిని శపిస్తే.. ఆయనపై ఈసీ వేటు వేసిందంటూ కామెడీ పంచ్ లు వదులుతున్నారు కేఏ పాల్.


అప్పుడప్పుడూ టీవీల్లో కనిపించి నవ్వించే పాల్.. మునుగోడు నియోజకవర్గ వీధుల్లో కలియ తిరుగుతుండటంతో.. స్థానికులు ఆయన్ను చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అది చూసి.. ప్రజలంతా తనవెంటే ఉన్నారని అనుకుంటున్నారో ఏమో.. పాపం పాల్.

Tags

Related News

Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. నవీన్ యాదవ్‌కు అనుకూల అంశాలేంటి..? గెలుపు శాతమెంత..?

CM Revanth: ప్రభుత్వ వెల్ఫేర్ సొసైటీలకు.. రేవంత్ సర్కార్ స్పెషల్ ఫండ్

Telangana Maoist Surrender: ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు-డీజీపీ

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బీజేపీ అభ్యర్థి బిఆర్ఎస్సే, డీల్ మామూలుగా లేదుగా

Hyderabad News: హైదరాబాద్‌‌‌ను వణికిస్తున్న జంతువులు.. మొన్న కొండ చిలువ, ఇప్పుడు 12 అడుగుల భారీ మొసలి

Jubilee Hills By-poll: జూబ్లీహిల్స్ బైపోల్.. బీజేపీ గేమ్ మొదలు, దూకుడుగా కాంగ్రెస్-బీఆర్ఎస్

Telangana Bandh: నేడు తెలంగాణ మొత్తం బంద్‌..! కారణం ఏంటంటే..

Weather Update: రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో రాత్రంతా కొట్టుడే కొట్టుడు, జాగ్రత్తగా ఉండండి

Big Stories

×