BigTV English

Lai Ching Te | తైవాన్‌ నూతన అధ్యక్షుడిగా లాయ్ చింగ్ తె.. మూడోసారి అధికారంలోకి డిపిపి!

Lai Ching Te | తైవాన్‌లోని డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ వరుసగా మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించింది. డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ అగ్రనేత ‘లాయ్ చింగ్ తె’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

Lai Ching Te | తైవాన్‌ నూతన అధ్యక్షుడిగా లాయ్ చింగ్ తె.. మూడోసారి అధికారంలోకి డిపిపి!

Lai Ching Te | తైవాన్‌లోని డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ వరుసగా మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించింది. డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ అగ్రనేత ‘లాయ్ చింగ్ తె’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తైవాన్‌ ప్రెసిడెంట్ ఎన్నికల రేసులో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ కౌమిన్‌టాంగ్ తరపున హౌ యుఇ, మరో పార్టీ తైవాన్ పీపుల్స్ పార్టీ తరపున కొవెన్ జె కూడా పోటీ చేశారు. వీరిద్దరిలో కొవెన్ జె ఇంతకుమందు తైవాన్ రాజధాని ‘తై పెయ్’ నగర మేయర్‌గా పనిచేశారు.


నూతన ప్రెసిడెంట్‌గా ఎన్నికైన లాయ్ చింగ్ తె ఇంతకుముందు వైస్ ప్రెసిడెంట్‌ పదవిలో ఉన్నారు. ఆయన చైనా వ్యతిరేక భావజాలం కలవారు. గత కొంతకాలంగా తైవాన్ దేశాన్ని ఆక్రమించుకుంటామని చైనా ప్రెసిడెంట్ షీ జిన్ పింగ్ పలుమార్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చైనాకు వ్యతిరేక భావజాలం ఉన్న డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందింది. దీంతో చైనాకు పెద్ద షాక్ తగిలింది.

మరోవైపు ప్రతిపక్ష పార్టీ నేత హౌ యుఇ చైనాను పక్షపాతి. ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. ” తాను తైవాన్ అధ్యక్ష పదవి చేపడితే.. చైనాతో సంబంధాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని,” చెప్పారు.


తైవాన్‌లో గత కొన్ని సంవత్సరాలుగా.. చైనా వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తోంది. ఎట్టి పరిస్థితిలోనూ చైనాలో తైవాన్ విలీనానికి అంగీకరించేది లేదని ఉద్యమకారులు నినాదాలు చేశారు. ఈ ఉద్యమం పలుమార్లు హింసాత్మకంగా కూడా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికలు జరగడంతో అందరూ ఊహించినట్లే.. చైనాను వ్యతిరేకించే పార్టీ గెలిచింది.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×