BigTV English

Interesting Love Track : లవర్ బాయ్ రిషి!.. అక్షతాతో ఇంట్రెస్టింగ్ లవ్ ట్రాక్

Interesting Love Track : లవర్ బాయ్ రిషి!.. అక్షతాతో ఇంట్రెస్టింగ్ లవ్ ట్రాక్

Interesting Love Track : రిషి సునాక్ బ్రిటన్ కు కాబోయే ప్రధాని. అంత ఈజీగా దక్కలేదు ఆ కిరీఠం. ఆయన రాజకీయ జీవితంలో అనేక ఎత్తుపళ్లాలు. ఓడి గెలిచిన ధీరుడు. రిషి ప్రస్థానంలో ప్రతీ అడుగులోనూ ఆయనకు తోడుగా నిలిచారు భార్య అక్షతా మూర్తి. ప్రధాని పీఠానికి పోటీపడే సమయంలో ట్యాక్స్ బెనిఫిట్స్ విషయంలో అక్షతాను కార్నర్ చేస్తూ సునాక్ ను టార్గెట్ చేశారు ప్రత్యర్థులు. అయినా, అదరకుండా బెదరకుండా.. భార్యాభర్తలు ఇద్దరూ చాకచక్యంగా ఆ విమర్శలకు చెక్ పెట్టారు.


మొదటినుంచీ వారిద్దరూ అంతే. తెలివిలో ఏమాత్రం ఎక్కువతక్కువ కాదు. ఒకరేమో రిచ్ కిడ్ రిషి సునాక్. ఇంకొకరేమో ఇన్ఫోసిస్ ఓనర్స్ సుధా, నారాయణమూర్తి కూతురు అక్షతా. రిషి, అక్షతాలు చిన్నప్పటి నుంచీ చదువులో టాప్. అమెరికా స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తుండగా వారి మధ్య ఫ్రెండ్ షిప్ కుదిరింది. అది మరింత డెవలప్ అయి.. ప్రేమగా మారింది. వారి లవ్ ట్రాక్ అలాఅలా కంటిన్యూ అయింది. వన్ ఫైన్ డే.. ఇరువైపులా పేరెంట్స్ అంగీకారంతో వెడ్డింగ్ బెల్స్ మోగాయి. గ్రాండ్ గా జరిగింది వారి పెళ్లి వేడుక. ఆ జంట.. మేడ్ ఫర్ ఈచ్ అదర్. వారికి ఇద్దరు కూతుళ్లు.

లిజ్ ట్రస్ కు పోటీగా ప్రధాని రేసులో రిషి సునాక్ నిలబడగానే.. ప్రత్యర్థులు ఆయన సతీమణి అక్షతామూర్తి బ్రిటన్ లో పన్ను ఎగవేస్తున్నారంటూ ఆరోపణలుక దిగారు. బ్రిటన్‌లో అక్షత నాన్‌-డొమిసైల్‌ హోదాలో ఉంటున్నారు. ఇప్పటికీ ఆమె భారత పౌరసత్వమే కొనసాగిస్తున్నారు. ఇదే వారికి ఆయుధంగా మారింది. వేరే దేశంలో స్థిర నివాసం ఉన్న వారికి బ్రిటన్‌లో నాన్‌-డొమిసైల్‌ పన్ను హోదా ఉంటుంది. అంటే, వారు విదేశాల్లో సంపాదించే ఆదాయానికి బ్రిటన్‌లో పన్ను కట్టనక్కరలేదు. ఇది చట్టబద్ధ పన్ను రాయితీనే. అయినా కూడా అదో తప్పుగా చూపిస్తూ.. ఆరోపణలు, విమర్శలతో ఊదరగొట్టాయి ప్రతిపక్షాలు. నాన్‌-డొమిసైల్‌ హోదాతో అక్షత. బ్రిటన్లో పన్ను ఎగవేస్తున్నారనేది వారి ఆరోపణ. నాన్‌-డొమిసైల్‌ పన్ను హోదా చట్టబద్ధమేనని.. తామేమీ తప్పు చేయడం లేదని అక్షతా వాదిస్తూ వచ్చారు. అయినా, విమర్శలు ఆగకపోవడంతో ఇకపై విదేశాల్లో పొందిన సంపాదనపై పన్ను మినహాయింపు పొందబోనని.. బ్రిటన్ లోనూ ట్యాక్స్ కడతానని.. తన భర్త పదవికి ఇబ్బంది రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసి.. విమర్శలకు చెక్ పెట్టారు అక్షతా.


తరగని ఆస్థి ఉన్నా.. చాలా సింపుల్ గా ఉంటారు ఆ దంపతులు. అసలేమాత్రం గర్వం కనిపించదు. ఇటీవల రిషి ఇంటిముందు మీడియా ప్రతినిధులు గంటల తరబడి కవరేజ్ ఇస్తుండగా.. వారి కోసం అక్షతనే స్వయంగా టీ, బిస్కెట్లు తీసుకొచ్చి ఇవ్వడాన్ని అంతా ప్రశంసించారు.

బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికవడంపై ఆయన మామ, ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు నారాయణమూర్తి స్పందించారు. యూకే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటారని విశ్వసిస్తున్నానని అన్నారు.

Tags

Related News

Trump Statement: భారత్, పాక్ కి నేనే వార్నింగ్ ఇచ్చా.. మరింత గట్టిగా ట్రంప్ సెల్ఫ్ డబ్బా

Trump’s Tariff War: ట్రంప్ టారిఫ్ స్టార్ట్! భారత్‌కు కలిగే నష్టాలు ఇవే..

India Vs America: అమెరికాతో ఢీ అంటే ఢీ.. ట్రంప్ సుంకాల్ని వెనుక వ్యూహమేంటి?

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. నమ్మండి ఇది నిజం

Donald Trump: మళ్లీ షాకిస్తున్న ట్రంప్.. ఇక అమెరికా గ్రీన్ కార్డు పొందడం కష్టమే..

Big Stories

×