BigTV English

Malawi Vice President: అడవిలో కూలిన విమానం.. ఉపాధ్యాక్షుడు సహా 10 మంది దుర్మరణం

Malawi Vice President: అడవిలో కూలిన విమానం.. ఉపాధ్యాక్షుడు సహా 10 మంది దుర్మరణం

Malawi Vice President and 10 others died in Plane Crash: మలావీ ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమాతో పాటు  మరో తొమ్మిది మందితో లిలోంగ్వే నుంచి బయలు దేరిన విమానం విఫ్య పర్వతాల్లోని చికంగావా అడవుల్లో కూలిపోయింది. వివిధ బృందాలతో భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా చికంవాగా అడవుల్లో వారు ఎయిర్ క్రాఫ్ట్ శకలాలు గుర్తించారు.


వివరాల్లోకి వెళితే..ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమాతో పాటు మరో తొమ్మిది మందితో లిలోంగ్వే నుంచి సోమవారం బయలు దేరిన సైనిక విమానం అదృశ్యమైంది. రాజధాని లిలోంగ్వే నుంచి బయలు దేరిన విమానం సుమారు 45 నిమిషాల తర్వాత 370 కిలో మీటర్ల దూరంలోని జుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. కానీ ఎంతసేపైనా అధికారులకు విమానం జాడ తెలియరాలేదు. అదే సమయంలోనే విమానానికి రాడార్‌తో సంబంధాలు కూడా తెగిపోయాయి.

రాడార్‌తో సంబంధాలు తెగిపోవడంతో విమానం ఆచూకి తెలుసుకోవడం కష్టంగా మారిందని మలావీ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ఇదిలా ఉంటే విమానం గల్లంతైన సంగతి తెలియగానే అధ్యక్షుడు లాజరసం చక్వేరా బహమాస్ పర్యటనను రద్దు చేసుకున్నారు. విమానం ఆచూకి కనిపెట్టేందుకు విసృత గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా ఎయిర్ క్రాఫ్ట్ అడవిలో శకలాలను గుర్తించారు.


Also Read: సైన్యం దూసుకొస్తే.. బందీలను కాల్చివేయండి: హమాస్ హెచ్చరిక !

ఉపాధ్యాక్షుడితో పాటు ఎవరూ సజీవంగా లేరని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ దేశ అధ్యక్ష భవనం నుంచి అధికారిక ప్రకటలన కూడా విడుదల చేశారు. ఈ దుర్ఝటనపై అధ్యక్షుడు లాజరస్ చక్వేరా తీవ్ర సంతాపం ప్రకటించారు.

Tags

Related News

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. నమ్మండి ఇది నిజం

Donald Trump: మళ్లీ షాకిస్తున్న ట్రంప్.. ఇక అమెరికా గ్రీన్ కార్డు పొందడం కష్టమే..

Terroist Masood Azhar: మసూద్ టార్గెట్ రూ.120 కోట్లు.. గ్లోబల్ టెర్రరిస్ట్‌కి విరాళాలు ఇస్తుంది ఎవరంటే..?

New York Bus Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Earthquake: సౌత్ అమెరికాను కుదిపేసిన భారీ భూకంపం.. 7.5గా నమోదు

Karachi city: జలదిగ్బంధంలో కరాచీ సిటీ.. వెంటాడుతున్న వర్షాలు, నిలిచిన విద్యుత్, ఆపై అంధకారం

Big Stories

×