BigTV English

Manisha koirala meets PM Rishi sunak: పీఎం రిషి సునాక్‌తో నటి మనీషా, అందుకోసమేనట

Manisha koirala meets PM Rishi sunak: పీఎం రిషి సునాక్‌తో నటి మనీషా, అందుకోసమేనట
Advertisement

Manisha koirala meets PM Rishi sunak: చాన్నాళ్ల తర్వాత అలనాటి బాలీవుడ్ హీరోయిన్ మనీషా కోయిరాలా కనిపించింది. 1990 దశకంలో బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిందామె. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టాయి. ఆ తర్వాత ఏమైందోగానీ ఆమె కనిపించలేదు.


సొంతూరు వెళ్లిపోయిందని అనుకున్నారు సినీ లవర్స్. తాజాగా బ్రిటన్ పీఎం రిషిసునాక్‌తో కలిసి మనీషా కోయిరాలా లండన్ దర్శనమిచ్చింది. అదెలా సాధ్యమంటారా? యూకె-నేపాల్ మధ్య రిలేషన్ షిప్‌కు 100 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ప్రత్యేక వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నేపాల్ తరపున మనీషా కోయిరాలా హాజరైంది.

లండన్‌లో ప్రధాని రిషిసునాక్ నివాసానికి వచ్చారు మనీషా కోయిరాలా. ఈ వేడుకలకు హాజరుకావడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారామె. రిషి కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడారని తెలిపారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్‌కు రావాలని ఆహ్వానించినట్టు తెలిపింది. అక్కడకు వచ్చిన అతిధులు హీరామండి వెబ్ సిరీస్ చూశామని చెప్పడంతో తనకు చాలా థ్రిల్‌గా ఉందని రాసుకొచ్చింది.


ALSO READ: ట్రంప్‌కు సినిమా ఎఫెక్ట్, ఆపై..

నార్మల్‌గా మనీషాకొయిరాలా సొంతూరు నేపాల్. వాళ్ల ఫ్యామిలీ రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె తాత బిశ్వేవ్వర్ ప్రసాద్ కోయిరాలా 1959లో నేపాల్ ప్రధానిగా పని చేశారు. ఆమె తండ్రి ప్రకాష్ కోయిరాల రాజకీయ నాయకుడు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీపై ఆసక్తితో మనీషా కోయిరాల ఈ రంగానికి వచ్చింది. చాన్నాళ్లు గ్లామర్ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. భన్సాలీ తెరకెక్కించిన హీరామండి వెబ్ సిరీస్‌లో ఆమె కనిపించిన విషయం తెల్సిందే.

 

View this post on Instagram

 

Tags

Related News

Dubai Gold Dress: ప్రపంచంలోనే అత్యంత బరువైన గోల్డ్ డ్రెస్.. దీని ఖరీదు ఎంతంటే..

Trump Zelensky: వైట్ హౌస్ చర్చల్లో రచ్చ రచ్చ.. ఇంతకీ ట్రంప్ మద్దతు రష్యాకా? ఉక్రెయిన్ కా?

PM Pakistan: దీపావళి విషెస్ చెప్పిన పాకిస్థాన్ ప్రధాని.. విరుచుకుపడుతోన్న భారత నెటిజన్లు

Donald Trump: ట్రంప్ హత్యకు మరోసారి కుట్ర..? ఈసారి ఏకంగా..!

Amazon Services: అమెజాన్ షాకింగ్ న్యూస్.. ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన వెబ్ సర్వీసెస్

Canada is Removing Indians: భారతీయుల్ని తరిమేస్తున్న కెనడా.. ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో బహిష్కరణ

Trump Tariffs: భారత్ కు ట్రంప్ మరో వార్నింగ్, అలా చేయకపోతే మరిన్ని సుంకాలు తప్పవట!

Louvre Museum Robbery: భారీ చోరీ.. పట్ట పగలే కోట్లు విలువ చేసే నగలు మాయం..

Big Stories

×