BigTV English

Gun firing at Newyork park: న్యూయార్క్ పార్క్‌లో కాల్పులు, భయంతో పరుగులు..

Gun firing at Newyork park: న్యూయార్క్ పార్క్‌లో కాల్పులు, భయంతో పరుగులు..

Gun firing at Newyork park: అమెరికాలోని న్యూయార్క్ సిటీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలో ఆసుపత్రికి పోలీసులు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో న్యూయార్క్ సిటీ రోచెస్టర్ ప్రాంతంలోని మాపెల్‌ వుడ్ పార్క్‌లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ మహిళ స్పాట్‌లో చనిపోయింది. ఆరుగురికి గాయాల య్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రీట్‌మెంట్ కోసం సమీపంలో ఆసుపత్రికి తరలించారు.

నిందితులు ఎంతమంది పార్కులోకి చొరబట్టారు? ఒకరా? లేకుంటే గ్రూప్‌గా వచ్చారా అనేదానిపై పోలీసులు లోతుగా విచారణ మొదలుపెట్టారు. కాల్పులు చోటు చేసుకున్న ప్రాంతంలో పార్టీ జరుగు తున్నట్లు నిర్ధారించారు. దీన్నిఅదునుగా భావించి కాల్పులు జరిపినట్లు భావిస్తున్నారు. ఇప్పటివరకు అనుమానితులు తమ అదుపులో లేరని పోలీసులు చెబుతున్నమాట.


ALSO READ: పాక్ లో రెండు వర్గాల మధ్య ఘర్షణ..36 మంది మృతి

కాల్పుల సమయంలో ఎవరైనా షూట్ చేస్తే అందుకు సంబంధించిన వీడియోను తమకు పంపాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు పోలీసులు.

 

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×