BigTV English

Mohamed Muizzu | భారత్ సైనికులు మాల్దీవ్స్ వదిలి వెళ్లాలి : అధ్యక్షుడు మొయిజు

Mohamed Muizzu | భారతదేశంలో మాల్దీవ్స్ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సమయంలో.. మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమద్ మొయిజు మళ్లీ దూకుడుగా వ్యవహరించారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలహీనపడుతున్న వేళ.. ఆయన భారత దేశం తమ సైన్యాన్ని ఉపసరించుకోవాలని అన్నారు.

Mohamed Muizzu | భారత్ సైనికులు మాల్దీవ్స్ వదిలి వెళ్లాలి : అధ్యక్షుడు మొయిజు

Mohamed Muizzu | భారతదేశంలో మాల్దీవ్స్ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సమయంలో.. మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమద్ మొయిజు మళ్లీ దూకుడుగా వ్యవహరించారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలహీనపడుతున్న వేళ.. ఆయన భారత దేశం తమ సైన్యాన్ని ఉపసరించుకోవాలని అన్నారు. మాల్దీవ్స్ రాజధాని మాలేలో భారత దౌత్యాధికారులతో.. మాల్దీవ్స్ అధికారులు ఈ అంశంపై చర్చించారు.
మార్చి 15లోపు భారత సైన్యం తిరిగి వెళ్లిపోవాలని మాల్దీవ్స్ అధికారులు కోరారు.


మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమద్ మొయిజు తన అయిదు రోజుల చైనా పర్యటన ముగించుకొని శనివారం స్వదేశానికి తిరిగివచ్చారు. ఆయన రాగానే భారత సైనికులను తిరిగి పంపిచే ప్రక్రియ మొదలుపెట్టాలని తన అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. భారత్ నుంచి తీసుకున్న హెలికాప్టర్లను కూడా ఉపయోగించడం ఆపేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే భారత్‌తో దౌత్య సంబంధాలపై కూడా మాల్దీవ్స్ అధికారులు సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది.

మాల్దీవ్స్‌లో గత కొన్ని సంవత్సరాలుగా 77 మంది భారత సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు. సైనిక సహాయంతో పాటు భారతదేశం మాల్దీవ్స్‌కు కానుకగా రెండు హెలికాప్టర్లు, ఒక విమానం కూడా ఇచ్చింది.


అయితే మాల్దీవ్స్‌లో భారత వ్యతిరేక నినాదంతో మహమద్ మొయిజు ఎన్నికలు గెలిచారు. ఆ తరువాత ఇటీవల ఆయన కేబినెట్‌లోని ముగ్గురు మంత్రులు, ఒక ఎంపీ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ, భారతదేశం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్లు చేశార. దీంతో భారత దేశంలో కూడా మాల్దీవ్స్ వ్యతిరేకంగా ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ ప్రచారం ప్రారంభమైంది. ఈ ప్రచారంలో సెలెబ్రిటీలు కూడా పాల్గొంటున్నారు. ఈ కారణంగా భారత్ నుంచి మాల్దీవ్స్ వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×