Vivo V2607: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో నుంచి త్వరలో మరో కొత్త మోడల్ మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల Vivo V2607 అనే మోడల్ పేరుతో ఒక ఫోన్ గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ సైట్‌లో కనిపించింది. ప్రముఖ లీకర్ అందించిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ మిడ్‌రేంజ్ ఫీచర్లతో వినియోగదారులను అలరించేందుకు రాబోతోందని తెలుస్తోంది.
ఈ కొత్త వివో ఫోన్‌లో 8GB ర్యామ్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఉండనున్నాయి. ఇందులో వాడిన MT6881 చిప్‌సెట్.. మీడియాటెక్ డైమెన్సిటీ 7500 కావచ్చని భావిస్తున్నారు. 2.6 GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేసే ఈ ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పాటు ఆర్మ్ మాలి-G625 iGPU, మీడియాటెక్ NPU 850 కూడా ఉంటాయి. దీంతో గేమింగ్‌తో పాటు ఏఐ (AI) ఫీచర్లలోనూ ఈ ఫోన్ మంచి పనితీరు కనబరిచే అవకాశముంది.
Also Read: నెట్‌ఫ్లిక్స్ కోసం విడిగా డబ్బులు వేస్ట్ చేస్తున్నారా? ఈ రీఛార్జ్ ప్లాన్లతో ఉచితంగానే చూడొచ్చు!
మరోవైపు వివో నుంచి Y31t అనే మరో ఫోన్ కూడా భారత మార్కెట్లోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ 6.75 అంగుళాల ఎల్‌సిడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌తో రానుందని సమాచారం. ఇక కెమెరా విషయానికొస్తే.. వెనుక వైపు 50MP ప్రాథమిక కెమెరాతో పాటు 2MP సెన్సార్, ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరా ఉండనున్నాయి.
ఈ వివో Y31t ప్రారంభ వేరియంట్ (4GB/128GB) ధర దాదాపు రూ.25,000 వరకు ఉండొచ్చని అంచనా. అయితే ఈ ప్రాసెసర్‌కు ఈ ధర కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. సాధారణంగా స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 చిప్‌సెట్ రూ.20,000 లోపు ఉండే బడ్జెట్ ఫోన్లకే సరిపోతుంది. ఇటీవల విడిభాగాల వ్యయం, ర్యామ్ ధరలు భారీగా పెరగడంతో, తయారీ కంపెనీలు బడ్జెట్ ప్రాసెసర్లు ఉన్న ఫోన్లను కూడా రూ.25,000 దాటించి విక్రయించాల్సి వస్తోంది.
Also Read: షావోమి ఫోన్లలో ఐఫోన్ తరహా గ్లాస్ డిజైన్.. మీ మోడల్ ఉందో లేదో చెక్ చేసుకోండి!