FIFA World Cup : పాపం.. మూగ జీవాలకు ఏం తెలుసు.. ప్రపంచ పోటీలకు తమ ప్రాణాలు బలైపోతాయని. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫుట్ బాల్ పోటీల కోసం తమ పాలిట మరణ శాసనం అవుతుందని. తాజాగా మెురాకోలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కేవలం ఫుట్బాల్ పోటీలను నిర్వహించడానికి దాదాపు 3 మిలియన్లకు పైగా కుక్కలను చంపటానికి అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జంతు ప్రేమికులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి.
మెురాకోలో 2030లో ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2030) పోటీలు జరగనున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన నిర్వహణను మొదలుపెట్టే పనిలో పడింది అక్కడ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే దాదాపు 30 లక్షలకు పైగా వీధి కుక్కలను హతమార్చాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం అతికిరాతకమైన మార్గాలను ఎంచుకుంది. కుక్కలను చంపడానికి విష పదార్థాలు ఇవ్వటం, కాల్చి వేయటం, ఇనుపరాడ్లతో తీవ్రంగా కొట్టడం లాంటివి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మెురాకో ప్రభుత్వం పట్ల జంతు హక్కుల సంఘాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
మెురాకో దేశంలో వీధి కుక్కలను చంపడాన్ని నిషేధించిన చట్టాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఇలాంటి అమానవీయమైన సంఘటనలకు పాల్పడుతుంది. ప్రభుత్వం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఉద్యమకారులు వ్యతిరేకంగా నినాదాలు సైతం చేస్తున్నారు. ట్రాప్-న్యూటర్-వ్యాక్సినేట్-రిలీజ్ (TNVR) వంటి ఎన్నో
రోజురోజుకి పెరిగిపోతున్న వివాదంతో ప్రఖ్యాత ప్రైమటాలజిస్ట్, జంతు హక్కుల న్యాయవాది జేన్ గూడాల్ ఈ ఘటనపై ఫిఫా జోక్యం చేసుకోవాలని విన్నపించారు. మెురాకోలో ఆతిధ్య బాధ్యతలను నిలిపివేయాలని కోరారు. అంతేకాకుండా ఈ ఘోరాన్ని ఆపేందుకు ఫీఫా వెంటనే చర్యలు తీసుకోవాలని గుడాల్ ఫుట్బాల్ గవర్నమెంట్ బాడీకి లేఖ కూడా రాశారు. జంతు ప్రేమికుల సంఘాలు ఇప్పటికే తీవ్ర వ్యతిరేకతను చూపిస్తున్నాయి. అయినప్పటికీ ఈ స్థితిపై మరొక ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తుంది.
ALSO READ : కిందపడ్డ ట్యాంకర్‌లో పెట్రోల్ చోరీకి ప్రయత్నించారు.. 70 మంది స్పాట్‌లోనే చనిపోయారు..
ఇలాంటి ఘటనలు ఎంత మాత్రం సరైనవి కాదని.. దీని వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని చెబుతున్నారు. చైనా సైతం ఒకప్పుడు ధాన్యాన్ని తింటున్నాయని కారణంతో కొన్ని లక్షల పక్షుల్ని వెంటాడి చంపేసింది. ఆపై పంట చేతికి వచ్చే సమయానికి పురుగులు తినే పక్షులు లేక తీవ్రంగా నష్టపోయింది. దీంతో మళ్ళీ పక్షుల్ని పెంచే ప్రయత్నాలు చేపట్టింది. ఇలాంటి కథనాలు ప్రపంచవ్యాప్తంగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో మెురాకో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం ఎంత మాత్రం సరైనది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వీధి కుక్కల నిర్మూలన పై మెురాకో చేపడుతున్న ఈ ఘటనపై వెల్లువెత్తుతున్న విమర్శలతో ఫిఫా ప్రత్యామ్నాయ మార్గంపై ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకు ఫీఫా ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ నిశితంగా ఇక్కడ జరిగే ప్రతీ విషయాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థలతో ఫీఫా మెురాకో ప్రభుత్వం ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
2030లో మెురాకో దేశం స్పెయిన్, పోర్చుగల్ తో కలిసి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసింది. 24వ ఫిఫా వరల్డ్ కప్ పోటీలకు ఈ దేశాలు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నాయి.