BigTV English

NASA : 28 వేల కి.మీ వేగంతో దూసుకొస్తున్న గ్రహశకలం – మార్చి 5న ఆకాశంలో అద్భుతం

NASA : 28 వేల కి.మీ వేగంతో దూసుకొస్తున్న గ్రహశకలం – మార్చి 5న ఆకాశంలో అద్భుతం

NASA : అంతరిక్షంలో తిరిగే గ్రహశకలాలతో భూమికి, భూ వాతావరణానికి ఏమైనా ప్రమాదం ఉంటుందా.? అనే విషయమై అంతరిక్ష శాస్త్రవేత్తలు నిత్యం ఓ కన్నేసి ఉంచుతారు. వీరు పరిశీలనలో 467 అడుగుల మేర పరిధిలోని ఓ భారీ గ్రహశకలం, అత్యధిక వేగంగా భూమికి చేరువగా దూసుకొస్తున్నట్లుగా గుర్తించారు. దీని వేగం, పరిమాణాన్ని బట్టి.. ఈ గ్రహశకలాన్ని అత్యంత ప్రమాదకరమైన గ్రహ శకలంగా నాసా ప్రకటించింది. ప్రస్తుతం ఇది అంతరిక్షంలో గంటకు 17,583 మైల్స్ ఫర్ అవర్ వేగంతో దూసుకుపోతుంది.


అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ -NASA భూమి వైపు అత్యంత వేగంతో దూసుకొస్తున్న ఈ భారీ విధ్వంసక గ్రహశకలం గురించిన హెచ్చరికలు జారీ చేసింది. ఇదే వేగంతో ఈ గ్రహశకలం భూవాతావరణలోకి ప్రవేశించి, భూమిని ఢీకొంటె జరిగే విధ్వంసం కొన్ని వందల అణు బాంబుల ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇది ఒకవేళ భూమి వాతావరణలోకి ప్రవేశించినా, దీని పరిమాణం దృష్య్టా వాతావరణంలో రాపిడికి గురై బూడిదగా మారే అవకాశం లేదు. అందుకే.. దీనిని ప్రమాదకర గ్రహశకలం కేటగిరీలో చేర్చారు. దీనికి.. ఆస్ట్రాయిడ్ 535844 (2015BY310) గా పేరు పెట్టిన శాస్త్రవేత్తలు.. దీని ప్రయాణ మార్గాన్ని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత అంచనాల మేరకు మార్చి 5న ఈ గ్రహశకలం భూమికి అత్యంత సమీపానికి రానున్నట్లు నాసా ప్రకటించింది.

భూమికి దగ్గరగా వచ్చే గ్రహశకలాలు, అంతరిక్ష వస్తువులను ట్రాక్ చేసేందుకు సెంటర్ ఫర్ నియర్ స్టడీస్ (CNEOS) నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. అత్యాధునిక టెలిస్కోప్ లు, అంతరిక్ష ఉపగ్రహాలు సహా వివిధ రకాల డేటాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ఇది భూమికి 22,80,000 మైళ్ళ దగ్గరకు వస్తుందని తెలిపింది. ఈ గ్రహశకలాన్నీ ప్రమాదకర గ్రహశకలంగా వర్గీకరించినందున దీని ప్రభావం భూమిపై చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగానే… శాస్త్రవేత్తలు దీని ప్రయాణ మార్గాన్ని నిరంతరం పరిశీలిస్తున్నారు.


ప్రస్తుతం.. శాస్త్రవేత్తలు తెలుపుతున్న వివరాలు, వివిధ డేటా నివేదికల ప్రకారం గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చినా.. భూమి గురుత్వాకర్షణ శక్తికి గురయ్యేంత దగ్గరకు రావడం లేదని నాసా ప్రకటించింది. ఒకవేళ ఇది గురుత్వాకర్షణ శక్తి పరిధిలోకి వస్తే, భూమి ఆకర్షించే అవకాశం గాని, భూ వాతావరణం లోకి వచ్చి భూమిని ఢీకొట్టే అవకాశాలు కానీ గణనీయంగా ఉంటాయి. కానీ ప్రస్తుత దీని గమనం ప్రకారం భూమి గురుత్వాక్షర శక్తి పరిధిలోకి రాకపోవడాన్ని పెద్ద ఉపశమనంగా చెబుతున్నారు.

ఈ గ్రహశకలం అపోలో సమూహానికి చెందినదిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిని potentially hazardous asteroid (PHA), తో Near earth object -NEO గా కూడా పిలుసున్నారు. భూమికి సమీపం నుంచి వెళ్లేటప్పుడు ఈ గ్రహశకలం వేగం 17,583 మైళ్ల ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూమికి వ్యతిరేక దిశలో ఇది అత్యధిక వేగంతో ప్రయాణిస్తుండడంతో.. భూమి వేగం, గ్రహశకలం వేగాలు కలిసి.. అంతరిక్షంలో విధ్వంసకర శక్తి గ్రహశకలానికి తోడవుతాయన్నది శాస్త్రవేత్తల ఆందోళన.

Also Read : Singer Sunitha: సింగర్ ఉషతో విభేదాలు.. క్లారిటీ ఇచ్చిన సునీత..!

నాసా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నప్పటికీ.. దాని NEO సర్వేయర్ టెలిస్కోప్ భూమికి ప్రమాదాలను కలిగించే గ్రహశకలాలు, తోకలు చుక్కలను వేగంగా గుర్తించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన మొట్టమొదటి అంతరిక్ష టెలిస్కోప్. ఇప్పటికే నాసా దగ్గర ఇతర పరికరాలు ఉన్నాయి. వాటిలో.. పాన్-స్టార్స్, కాటాలినా స్కై సర్వే, ప్లానెటరీ రాడార్ ప్రాజెక్టులు ఉపయోగంలో ఉన్నాయి.

Tags

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×