కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజి రెడ్డి విజయం సాధించారు. హోరా హోరీగా కొనసాగిన పోరులో రెండో ప్రాధాన్యత ఓట్లతో ఆయన గెలుపొందారు. కాసేపట్లో దీనిపై ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. దీంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి రెండో స్థానంలో, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానంలో ఉన్నారు. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
ALSO READ: IPPB Recruitment: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. రూ.30,000 వరకు జీతం.. జస్ట్ ఇంటర్వ్యూతో జాబ్ భయ్యా..
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 2,52,007 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 27,671 ఓట్లు చెల్లనవి ఉన్నాయి. 2,24,336 ఓట్లు చెల్లడంతో 1,12,169 ఓట్లను అధికారులు కోటాగా ప్రకటించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో పాటు 53 మంది ఎలిమినేషన్ అనంతరం బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 78,635 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 73,644, బిఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకి 63,404 ఓట్లు వచ్చాయి. మొత్తం 56 మంది పోటీలో ఉండగా 53 మందికి కలిపి కేవలం 17,244 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ALSO READ: AAI Recruitment: బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.40,000 జీతం.. మరి ఇంకెందుకు ఆలస్యం..
53 మంది ఎలిమినేషన్ అనంతరం ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించే సమయంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కాస్త ఆందోళన గురయ్యారు. చివరకు ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన రెండో ప్రాధాన్యత ఓట్లలో సైతం బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 500 ఓట్లకు పైగా మెజార్టీ సాధించారు. దీంతో ఎన్నికల అధికారి కాసేపట్లో అధికారికంగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలిచారని ప్రకటించనున్నారు.
అయితే, మూడు రోజులపాటు సాగిన హోరా హోరీ పోరు విజయం దోబూచులాడి చివరకు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డిని వరించింది. 53 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తనకు 97,880 ఓట్లు వచ్చాయని, 5వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించినట్టు అంజిరెడ్డి చెప్పారు.