BigTV English

Nepal floods, landslides: నేపాల్‌లో వరద బీభత్సం.. 62కు చేరిన మృతుల సంఖ్య!

Nepal floods, landslides: నేపాల్‌లో వరద బీభత్సం..  62కు చేరిన మృతుల సంఖ్య!

Nepal floods live updates(Today international news headlines): నేపాల్‌లో వరదలు వణికిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు సంభవించాయి. ఈ వరదల ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. వరదల్లో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 62కు చేరింది. ఈ ప్రమాదంలో మరో 90మంది గాయపడ్డారు. మృతుల్లో 34 మంది కొండచరియలు విరిగిపడి చనిపోగా.. 28 మంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చనిపోయినట్లు హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.


నేపాల్‌లో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో 121 ఇళ్లు నీటమునగగా.. 82 ఇళ్లు దెబ్బతిన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు తీసుకోవాలని నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీలు, ప్రైవేట్ సంస్థలు, సామాజిక సంస్థలు విపత్తు ప్రమాదాలను తగ్గించడంలో సహకరించాలని పిలుపునిచ్చారు.

దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో రానున్న రోజుల్లో నేపాల్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సింగ్ దర్మార్ లోని కంట్రోల్ రూమ్ లో ఆదివారం జరిగిన సమావేశంలో ప్రకృతి వైపరీత్యాలపై దృష్టి సారించాలని ప్రధాని ప్రచండ రాష్ట్ర ఏజెన్సీలను ఆదేశించారు. విపత్తులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదుల్లో నీటిమట్టం పెరగడంతో సమీప ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.


నారాయణి నదిలో నీటిమట్టం పెరిగింది. దీంతో గండక్ బ్యారేజీ గేట్లు ఎత్తివేశారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నదీ పరివాహాక ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ బ్యారేజీలో 440,750 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. నీటి ప్రవాహం మరింత పెరగడంతో కోసి బ్యారేజీలోని 41 గేట్లను సైతం తెరిచినట్లు అధికారులు తెలిపారు.

Also Read: హెచ్‌ఐవీకి ఇంజెక్షన్‌ వచ్చేసింది.. రెండేళ్లలో వ్యాధి నుంచి విముక్తి..

నేపాల్‌లో వరదల ధాటికి ఇప్పటికే పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. గతేడాది ఇదే సమయంలో కొండచరియలు విరిగిపడి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రుతుపవనాల సమయంలో కొండచరియలు, వరదల ధాటికి అధిక సంఖ్యలు మరణాలు నమోదువుతుననాయి. ముఖ్యంగా ఖాట్మండు, భక్తపూర్, లలిత్ పూర్ జిల్లాలతో కూడిన ఖాట్మండు లోయలో నిరంతరంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు సైతం భయంకరంగా ప్రవహిస్తున్నాయి. ఈ ధాటికి పెను ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×