BigTV English

Nepal plane crash: నేపాల్‌లో ఘోరం.. టేకాఫ్ అవుతూ కూలిన విమానం.. 19 మంది?

Nepal plane crash: నేపాల్‌లో ఘోరం.. టేకాఫ్ అవుతూ కూలిన విమానం.. 19 మంది?

Nepal plane crash: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్‌పోర్టులో రన్‌వే నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రమాదం సమయంలో విమానంలో 19 మంది ఉన్నారు.


బుధవారం ఉదయం 11 గంటల సమయంలో 19 మంది కూడిన శౌర్య ఎయిర్ లైన్స్‌ విమానం ఖాట్మండ్ నుంచి పొఖార్‌కు బయలుదేరింది. ఖాట్మండ్‌లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అవుతోంది. రన్ వే నుంచి టేకాప్ అవుతున్న సమయంలో విమానం ఒక్కసారిగా జారిపోయింది. దీంతో విమానం స్పాట్‌లో కుప్పకూలింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.

ప్రమాదం సమయంలో అందులో 19 మంది సాంకేతిక సిబ్బంది ఉన్నారు. 18 మంది మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన పైలట్‌ను ఖాట్మండ్ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులు ఎవరూ లేరని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ ఫైటర్లు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.


ALSO READ: చేతన సంచలన కామెంట్స్.. భారతీయ పురుషులకు రొమాన్స్ అంటే తెలీదు..

నేపాల్‌లోని పర్యాటక కేంద్రాల్లో ఫోఖాన్ కూడా ఒకటి. ఇటీవలకాలంలో నేపాల్‌లో ఎయిర్‌పోర్టు ఇండస్ట్రీ క్రమక్రమంగా వృద్ధి చెందుతోంది. పర్యాటకులతోపాటు టెక్కింగ్‌, మౌంట్ ఎవరెస్టు వెళ్లేవారంతా అక్కడికి వస్తున్నారు. అయితే సేఫ్టీ పాటించలేదని వార్తలు లేకపోలేదు. దీంతో నేపాల్‌కి చెందిన విమానాలపై యూరోపియన్ యూనియన్ తమ గగనతలంలో నిషేధం విధించింది.

2010 నుంచి నేపాల్‌లో ఏడాదికి ఒకటి చొప్పున విమానం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 12 ఘటనలు చోటు చేసుకున్నాయి. గతేడాది పొఖార్ సమీపంలో ఓ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 72 మంది మరణించిన విషయం తెల్సిందే. 2022లో ముస్తాంగ్ జిల్లాలో తారా ఎయిర్‌లైన్స్‌కి విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 22మంది వ్యక్తులు చనిపోయిన విషయం తెల్సిందే.

 

Related News

New York Bus Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Earthquake: సౌత్ అమెరికాను కుదిపేసిన భారీ భూకంపం.. 7.5గా నమోదు

Karachi city: జలదిగ్బంధంలో కరాచీ సిటీ.. వెంటాడుతున్న వర్షాలు, నిలిచిన విద్యుత్, ఆపై అంధకారం

America Tariffs: రష్యాపై ఒత్తిడికోసమే భారత్ పై సుంకాల మోత.. అసలు విషయం ఒప్పుకున్న అమెరికా

Spain Wildfires: స్పెయిన్‌లో కార్చిచ్చు.. 20 ప్రాంతాలకు విస్తరిస్తున్న మంటలు.. ఇదిగో వీడియో..

Afghanistan: బస్సులో చెలరేగిన మంటలు.. 71 మంది సజీవదహనం!

Big Stories

×