BigTV English

Newyear New Things: కొత్త ఏడాదిలో సరికొత్త మార్పులు.. అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియో.. ఇంకా ఎన్నో..

Newyear New Things: కొత్త ఏడాదిలో సరికొత్త మార్పులు.. అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియో.. ఇంకా ఎన్నో..

Newyear New Things: కొత్త సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా మనం ఊహించని సరికొత్త ఆవిష్కరణలు, మార్పులను చూడబోతున్నాం. ఆకలిచావులను నివారించే కొత్త ఔషధంతో సహా ఈ ఏడాదిలో రానున్న పలు ఆవిష్కరణలు మానవాళిని కొత్త ఆశలను కలిగిస్తున్నాయి.


ఇప్పటివరకు రామోజీ ఫిల్మ్ స్టూడియో వంటి స్టూడియోల్లో జరుగుతున్న సినిమా చిత్రీకరణ.. ఇకపై ఏకంగా అంతరిక్షంలో జరగనుంది. ‘ఎస్‌ఈఈ-1’ పేరుతో 2024 డిసెంబరు నాటికి అందుబాటులోకి రానున్న అదిరిపోయే ఫిల్మ్ స్టూడియోలో ఇక ఎంచక్కా సినిమాలు తీయొచ్చు.

పోషకాహార లోపాన్ని అంతం చేసే ఔషధాన్ని బిల్ గేట్స్ ఫౌండేషన్ 2024లో తీసుకురానుంది. తుదిదశ ప్రయోగాలు జరుగుతున్న ఈ ఔషధాన్ని 2024లోనే వాడేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతీ లభించింది. దీనిరాకతో ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న శిశుమరణాలు, పోషకాహార లోపం వల్ల తలెత్తుతున్న అనారోగ్యాల నుంచి మానవాళికి విముక్తి లభించనుంది.


రెండువేల ఏళ్లకు పైగా చరిత్రగల వాటికన్‌.. ధార్మిక విషయాల్లో నెలకొన్న లింగవివక్షకు చరమగీతం పాడనుంది. పోప్ ప్రాన్సిస్ చొరవతో 2024లో రానున్న ‘కానన్ లా’ అమలుతో ఇకపై మహిళలూ అత్యధిక స్థాయి మతాధికారులుగా నియమితులు కానున్నారు. అంతేకాదు.. పోప్ తీసుకునే నిర్ణయాలను చర్చించే.. సైనాడ్ ఆఫ్ బిషప్స్ సమావేశంలో ఓటు వేసేందుకు ఇకపై మహిళలకూ అవకాశం లభించనుంది. నేటి వరకు మహిళలకు ఇందులో ఓటు వేసే అవకాశం లేదు.

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 52 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాదిలో నలుగురు వ్యోమగాములను చంద్రునిపైకి పంపనుంది. 1972లో అపోలో-17 మిషన్‌లో ‘నాసా’ ఇద్దరు వ్యోమగాములను చంద్రునిపైకి పంపింది.

యూరప్‌ తన మొదటి ఎక్సా-స్కేల్ సూపర్ కంప్యూటర్‌ను 2024లో ప్రపంచానికి పరిచయం చేయనుంది. ఊహకు మించిన వేగంతో పనిచేయనున్న ఈ కంప్యూటర్‌ను జర్మనీలోని జూలిచ్‌లోని నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేయనున్నారు.

ప్రపంచ చరిత్రలో అతిపెద్ద అంతరిక్ష నౌక నిర్మితం కానుంది. ‘క్లిప్పర్ మిషన్’ పేరుతో రానున్న ఈ వ్యోమనౌక బరువు ఇంధనం లేనపుడు 3241 కేజీలు కాగా దీని పొడవు 30 మీటర్లు. బాస్కెట్‌బాల్ కోర్ట్ అంత సైజులో ఉండే ఈ 24 ఇంజన్ల వ్యోమనౌక.. జూపిటర్ మిషన్‌లో భాగంగా సిద్దమవుతోంది.

ఈ ఏడాది ముచ్చటగా మూడోసారి పారిస్‌ నగరంలో ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. ఒలింపిక్ క్రీడలను మూడుసార్లు నిర్వహించిన చరిత్ర ఇప్పటివరకు లండన్ నగరానికే ఉండగా.. ఈ ఏడాది జరగనున్న క్రీడలతో పారిస్ ఆ రికార్డును సమం చేయనుంది. ఈ క్రీడావేడుకలకు రూ.76 వేల కోట్లు ఖర్చు కానుంది.

Tags

Related News

California Murder: అమెరికాలో లైంగిక నేరస్థుడిని హత్య చేసిన భారతీయుడు.. వెబ్ సైట్ లో వెతికి, మారువేషంలో గాలించి మరీ

Netflix: H1-B వీసా ఫీజు పెంపుని సమర్థించిన నెట్ ఫ్లిక్స్ అధినేత..

Larry Ellison: నా ఆస్తుల్లో 95 శాతం పంచేస్తా.. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ల్యారీ ఎల్లిసన్ కీలక ప్రకటన

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Big Stories

×