Big Stories

North Korea: మరోసారి కిమ్ కవ్వింపు చర్యలు.. జపాన్ దిశగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం

North Korea Fires Intermediate Range Ballistic Missile
North Korea Fires Intermediate Range Ballistic Missile

North korea news today(Today’s international news): గత కొన్ని రోజులుగా ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. వరుసగా బాలిస్టిక్ క్షిపణిలను పరీక్షించి ప్రపంచాన్ని ఉలిక్కపడేలా చేస్తోంది. ఉత్తర కొరియా ఈ ఏడాది ఇప్పటికే రెండు బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. అయితే తాజాగా ఉత్తర కొరియా మరోసారి జపాన్ సముద్ర జలాల దిశగా మిస్సైల్ ను టెస్ట్ చేసింది.

- Advertisement -

ఉత్తర కొరియా మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని జపాన్ సముద్ర జలాల మీదుగా ప్రయోగించిన విషయాన్ని దక్షిణ కొరియా చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. కొత్త రకం ఇంటర్మీడియ్ రేంజ్ హైపర్ సోనిక్ క్షిపణిని నార్త్ కొరియా అధ్యక్షుడు ఇటీవలే ఇంజిన్ పరీక్షలు నిర్వహించారని వెల్లడించారు.

- Advertisement -

కిమ్ సైన్యం బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు జపాన్ రక్షణ శాఖ కూడా అధికారికంగా ప్రకటించింది. ఉత్తర కొరియా ప్రయోగించిన ఆ క్షిపణి ప్రొజెక్టైల్ సముద్ర జలాల్లో పడినట్లు జపాన్ రక్షణ మంత్రి తెలిపారు. ఉత్తర కొరియా సైనిక దళాలు ఆ క్షిపణిని పశ్చిమ తీరం నుంచి ప్రయోగించినట్లు తెలుస్తోంది.

Also Read: Iran Embassy: ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ భీకర దాడి.. పలువురు మృతి

అయితే ఉత్తర కొరియా క్షిపణిని పరీక్షించడంపై జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా తీవ్రంగా ఖండించారు. కిమ్ ప్రభుత్వం ఇప్పటికే ఈ ఏడాది బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని.. దీంతో ప్రాంతీయ భద్రతకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితిల్లోనూ ఆమోదించబోమన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News