Pakistan civil war: పాకిస్తాన్ కు టైమ్ బాగాలేదు. ఒకటి పోయాక మరొకటి నెత్తిమీద గుదిబండలా తయారైంది. దీనితో పాకిస్తాన్ ఇప్పుడిప్పుడే కోలుకొనే పరిస్థితిలో లేదు. ఇటు మన దేశం ఇచ్చే షాక్ లు, అటు ఇతర దేశాల సపోర్ట్ లేకపోవడం, మరోవైపు పాకిస్తానీల ఆగ్రహం. ఇవన్నీ కలగలిపి ఇప్పుడు పాకిస్తాన్ కు దిమ్మతిరిగింది. ఇంతలోనే మరో బిగ్ షాక్ తగిలింది పాకిస్తాన్ కు. ఆ బిగ్ షాక్ ఏమిటో తెలుసుకుందాం.
అంతర్గత యుద్ధం..
పాకిస్తాన్ లో అంతర్గత భద్రతా పరిస్థితులు రోజురోజుకూ విషమిస్తున్నాయి. ప్రత్యేకంగా బలూచిస్తాన్ రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పుతున్నాయి. అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పేరిట కొనసాగుతున్న సాయుధ ఉద్యమం ఇప్పుడు పాక్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఏయ్.. బలూచిస్తాన్ మాది అంటూ అక్కడి లిబరేషన్ ఆర్మీ హంగామా మొదలు పెట్టింది.
బలుచిస్తాన్ మిలిటెంట్‌లు తాజాగా మంగుచోర్ అనే కీలక ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్ సైనికులు, ప్రభుత్వ అధికారులు పలువురు బందీగా పట్టుబడినట్టు స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో బలూచిస్తాన్ ప్రాంతం మెల్లగా పాక్ కేంద్ర ప్రభుత్వ నియంత్రణ నుంచి జారిపోతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
క్వేట్టా లక్ష్యంగా దాడులు
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దళాలు క్వేట్టా నగరాన్ని తమ తదుపరి లక్ష్యంగా చేసుకుని దాడులను ముమ్మరం చేశాయి. స్థానిక ప్రభుత్వ భవనాలు, సైనిక స్థావరాలపై పేలుళ్లు, కాల్పుల ఘటనలు పెరిగాయి. సామాన్య ప్రజలలో భయానక వాతావరణం ఏర్పడింది. పాక్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. అయినప్పటికీ లిబరేషన్ ఆర్మీ దాడులకు అడ్డుకట్ట వేయడంలో పాక్ సైన్యం విఫలమవుతోంది.
పాక్, చైనాకు హెచ్చరిక
బలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్, చైనా పూర్తిగా వెనక్కు తళ్లాలని లిబరేషన్ ఆర్మీ స్పష్టం చేసింది. చైనా పెట్టుబడులతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై కూడా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశమున్నట్టు హెచ్చరికలు మొదలయ్యాయి. ప్రత్యేకించి చైనా–పాక్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్ట్ భద్రతపై ఇప్పుడే అనుమానాలు మొదలయ్యాయని చెప్పవచ్చు.
Also Read: Firefighters’ Day: మే 4న ‘సౌండ్ ఆఫ్’ను ఎందుకు పాటిస్తారో తెలుసా?
స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్?
బలూచిస్తాన్ పాక్‌కు చెందదు. మా భూమిని మేమే పాలించాలి. స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్‌ను ప్రకటించాలన్నది తమ డిమాండ్ అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నాయకత్వం తేల్చిచెప్పింది. ఈ పరిణామాలతో పాక్ లో అంతర్యుద్ధ మంటలు మరింత ఊపందుకునే అవకాశముంది. ఇప్పటికే కుయ్యో మొర్రో అంటున్న పాకిస్తాన్ కు తమ దేశంలో అంతర్యుద్ధం మొదలు కాగానే, తెగ ఏడుస్తోందట. చేసిన పాపం ఊరికే పోదని ఊరికే అంటారా.. ఇందుకే అంటారేమో.