BigTV English
Advertisement

Pakistan Elections: సంక్షోభాల నడుమ పాక్ ఎన్నికలు..

Pakistan Elections: సంక్షోభాల నడుమ పాక్ ఎన్నికలు..
Pakistan Elections 2024

Pakistan Elections 2024 (news paper today):


ఆర్థిక, రాజకీయ సంక్షోభాల నడుమ పాకిస్థాన్‌ ప్రజలు 12వ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యారు. 12.8 కోట్ల మంది ఓటర్లు గురువారం కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు.1947లో స్వతంత్రదేశంగా అవతరించిన అనంతరం మూడున్నర దశాబ్దాలకు పైగా సైనిక పాలనలోనే పాక్ మగ్గిపోయింది. అధికారంలో లేని సమయంలోనూ పెత్తనాన్ని కొనసాగించే స్థాయికి మిలటరీ తన పట్టును పెంచుకుంది.

రాజకీయాలను ప్రభావితం చేయడంతో పాటు నేరుగా జోక్యం చేసుకోగలదని పదే పదే రుజువుచేసింది సైన్యం. రాజకీయాల్లో సైన్యం ప్రమేయం మితిమీరిపోయిందన్న ఆరోపణలు ఇటీవలి కాలంలో జోరందుకున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, ఆయన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్(PTI)పై విరుచుకుపడటం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా ఇమ్రాన్‌ఖాన్‌పై కేసులు పెట్టి జైలుకు పంపారు. ఎన్నికల గుర్తు అయిన క్రికెట్ బ్యాట్‌ను ఆ పార్టీకి దక్కకుండా అడ్డుపడింది సైన్యం.


Read More: Pakistan General Elections 2024 : పాక్ లో సార్వత్రిక ఎన్నికలు.. అధికార పగ్గాలు చేపట్టేదెవరు ?

ఎన్నికల సంఘం పీటీఐ గుర్తును స్తంభింపచేయడంతో ఆ పార్టీ అభ్యర్థులు స్వతంత్రులుగానే గోదాలోకి దిగుతున్నారు. పాక్ చరిత్రలోనే సుదీర్ఘకాలం.. అంటే 16 ఏళ్లుగా పౌరనేతలే అధికారికంగా పాలిస్తుండటం కొంత ఉపశమనం కలిగించే అంశం. పార్టీ ఏదైనా కీలుబొమ్మ ప్రధాని ఉండటమే పాక్ సైన్యానికి కావాల్సింది.

ఈ నేపథ్యంలో పోలింగ్‌కు దేశం సర్వసన్నద్ధమైంది. ఉదయం 8 గంటలకు ఆరంభమయ్యే పోలింగ్.. విరామం లేకుండా సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. తమ తమ ప్రొవిన్షియల్ అసెంబ్లీలతో పాటు జాతీయ అసెంబ్లీకి అభ్యర్థులను ఓటర్లు ఎన్నుకోవాల్సి వస్తుంది. ఓటింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ఆరంభమవుతుంది. నిరుడు నియోజకవర్గాల పునర్విభజన కారణంగా జాతీయ అసెంబ్లీలో సీట్ల సంఖ్య 272 నుంచి 266కి తగ్గింది. మొత్తం 5,121 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో యువ ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటం విశేషం.

ఇదీ లెక్క..

మొత్తం ఓటర్లు ..12.8 కోట్లు
పురుషులు.. 6.9 కోట్లు
మహిళలు.. 5.9 కోట్లు
ఓటింగ్ వయసు.. 18 ఏళ్లు
పోలింగ్ స్టేషన్లు.. 90,582
నమోదైన రాజకీయ పార్టీలు.. 167
పోటీ చేసే స్థానాలు.. 266
జాతీయ అసెంబ్లీ అభ్యర్థులు.. 5,121
పురుష అభ్యర్థులు .. 4,806
మహిళలు.. 312
ట్రాన్స్‌జెండర్లు.. 2

Tags

Related News

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Big Stories

×