BigTV English

Imran Khan : పెళ్లి తెచ్చిన లొల్లి.. పాక్ మాజీ ప్రధానికి మరో ఏడేళ్ల శిక్ష..

Imran Khan : పెళ్లి తెచ్చిన లొల్లి.. పాక్ మాజీ ప్రధానికి మరో ఏడేళ్ల శిక్ష..
Imran Khan

Imran Khan : అసలే కోతి, దానికితోడు కల్లుతాగింది.. పైన తేలు కుట్టింది. ఈ పరిస్థతి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సరిగ్గా పోలుతుంది. ఇప్పటికే జైల్లో ఉన్న ఆయనకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇమ్రాన్ ఖాన్, అతని భార్య బుష్రా ఖాన్‌కు పాక్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి చేసుకున్నారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో పాకిస్థాన్ కోర్టు ఈ తీర్పునిచ్చింది.


బుష్రా ఖాన్ మొదటి భర్త ఖవార్‌ ఫరీద్‌ ఇమ్రాన్ జంటపై కేసు పెట్టగా.. ట్రయల్ కోర్టు విచారణ జరిపింది. బుష్రా తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి, ఇమ్రాన్ ఖాన్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఇస్లాం నిర్దేశించిన “ఇద్దత్” పీరియడ్‌ను పూర్తి చేయలేదని ఖవార్‌ ఫరీద్‌ ఆరోపించారు. అదీ కాకుండా పెళ్లికి ముందే వీరిరువురి మధ్య అక్రమ సంబంధం ఉందని ఆరోపించారు. దీంతో విచారణ జరిపిన కోర్టు.. ఇమ్రాన్ జంటకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది.

కాగా బుష్రా ఖాన్ 2017 నవంబరులో ఖవార్ ఫరీద్‌ నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2018 జనవరిలో ఇమ్రాన్‌ను పెళ్లాడారు. అంతకుముందు తోషఖానా కేసులో ఇప్పటికే వీరిద్దరికీ 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. రాష్ట్ర రహస్యాలను లీక్ చేసినందుకు 10 సంవత్సరాలు శిక్ష పడింది. ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో ఎన్నికలున్నాయి. ఈ తరుణంలో ఇమ్రాన్ ఖాన్‌కు వరుసగా శిక్షలు పడటం, తన పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌‌కు గట్టి ఎదురుదెబ్బే.


Tags

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×