Balochistan: పాకిస్తాన్ -భారత్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో బలూచిస్తాన్‌పై ఫోకస్ చేశారు ఇస్లామాబాద్ పాలకులు. అక్కడి తిరుగుబాటు దారులను ఉక్కుపాదంతో అణిచి వేసేలా హిందూ మహిళను రంగంలోకి దింపారు. బలూచిస్తాన్ తిరుగుబాటుదారులకు భారత్ మద్దతు ఇస్తుందన్న అనుమానంతో ఈమెని ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
బలూచిస్తాన్ ప్రావెన్సు వాసి 25 ఏళ్ల కాశీష్ చౌదరి. ఆమెని ఆ ప్రాంతం అసిస్టెంట్ కమిషనర్‌గా నియమించారు పాలకులు. చిన్న వయస్సులో కీలకమైన ఆ ప్రాంతానికి ఆమెని నియమించడం వెనుక రకరకాల కథనాలు లేకపోలేదు. బలూచిస్తాన్‌లోని అత్యంత అభివృద్ధి చెందిన చాగై జిల్లాలోని నోష్కిలో పట్టణంలో ఆమె ఉంటున్నారు.
బలూచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-BPSC పరీక్షలో ఆమె విజయం సాధించడంతో ఈ పదవిలో ఆమెని నియమించారు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఎక్కువ మంది హిందువులు సెటిలయ్యారు. ఆ ప్రాంతం నుంచి కాశీష్ చౌదరి ఫ్యామిలీ బలూచిస్తాన్ వచ్చింది.
సోమవారం కాశీష్ చౌదరి తన తండ్రితో కలిసి బలూచిస్తాన్ సీఎం సర్ఫరాజ్ బుగ్తిని కలిశారు. పాకిస్తాన్ హిందూ మహిళలకు ఈ స్థాయి పదవి ఇవ్వడమంటే ఆషామాషీ కాదు. కాకపోతే ఈ ప్రాంతంలో ఇప్పుడు ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఈ పదవి ఇచ్చారని అంటున్నారు. లేకుంటే 25 ఏళ్లకే ఆ ప్రాంత అసిస్టెంట్ కమిషనర్ పదవి అంటే మామూలు విషయం కాదంటున్నారు.
ALSO READ: పాకిస్తాన్ ప్రభుత్వం.. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ 14 కోట్లు, అదెలా సాధ్యం?
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వారం కిందట ఓ నగరాన్ని స్వాధీనం చేసుకుంది. రోజురోజుకూ వారి ఆగడాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తమకు ప్రత్యేక దేశం కావాలని ఇస్లామాబాద్ పాలకులపై ఒత్తిడి చేస్తున్నారు. ఆ ప్రాంతంలో కేవలం ఐదు శాతం మాత్రమే వ్యవసాయ భూమి ఉంది. ఆ ప్రావెన్సు వెనుకబడటానికి ఇదీ కూడా ఓ కారణంగా చెబుతున్నారు.
కాకపోతే ఆ ప్రాంత ఖనిజ సంపదను ఇస్లామాబాద్ పాలకులు దోచుకుపోతున్నారన్నది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రధాన ఆరోపణ. అందుకే తమను స్వతంత్య్ర దేశంగా ప్రకటించాలని దశాబ్దాల తరబడి అక్కడి ప్రజలు కోరుతున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి భారత్‌తో సంబంధాలున్నాయని ఇస్లామాబాద్ పాలకుల అంచనా.
ఈ క్రమంలో హిందూ మహిళకు కీలక పదవి అప్పగించారని అంటున్నారు. మొన్నటికి మొన్న భారత్-పాక్ కాల్పుల విరమణను తప్పుబట్టారు. ఈ విషయంలో భారత్ పాలకులు పాకిస్థాన్‌ను తక్కువ అంచనా వేస్తున్నారని ఓ లేఖ విడుదల చేశారు. అంతలో హిందూ మహిళను అసిస్టెంట్ కమిషనర్ పదవిలో కూర్చోబెట్టారు.
وزیر اعلیٰ بلوچستان سے کم عمر اقلیتی افسر اسسٹنٹ کمشنر کشش چوہدری کی ملاقات، کشش چوہدری نے اپنی محنت، لگن اور استقامت سے نہ صرف اپنی صلاحیتوں کا لوہا منوایا بلکہ اقلیتی برادری کے دیگر نوجوانوں کے لیے بھی مشعلِ راہ بن گئی ہیں، میر سرفراز بگٹی@PakSarfrazbugti pic.twitter.com/JaQaomXzhT
— Chief Minister's Office Balochistan (@CMOBalochistan) May 12, 2025