KA Paul : కేఏ పాల్ అన్నంత పనీ చేశారు. విమానాశ్రయంలో అడ్డుకున్నా.. పట్టు వీడలేదు. తప్పించుకుని మరీ టర్కీ వెళ్లిపోయారు. శాంతి చర్చలు జరిపారు. ఇండియా పాక్ యుద్ధం ఆపేశారు. టర్కీ నుంచి పాకిస్తాన్‌కు ఆయుధాలు అందకుండా ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ శాంతి దూతలతో కలిసి టర్కీలో కీలక చర్చలు జరుపుతున్నారు. ఇదీ సంగతి. ఇదంతా నిజమేనా? అనే డౌట్ అవసరం లేదు. ఎందుకంటే ఈ వివరాలన్నీ చెప్పింది ఆయనే. ఆ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు కేఏ పాల్. ఆ వీడియోలో ఆయన పక్కనే మరో విదేశీ శాంతి దూత కూడా ఉన్నారు. ఇదీ పాల్ రేంజ్.
పాల్ లాజికల్ క్వశ్చన్స్
పాల్ రిలీజ్ చేసిన వీడియోలో పలు లాజికల్ అంశాలు ప్రస్తావించారు. పాకిస్తాన్‌కు డ్రోన్లు అమ్మిందనే కోపంతో ప్రస్తుతం ఇండియాలో బైకాట్ టర్కీ నడుస్తోందని పాల్ గుర్తు చేశారు. అయితే, పాక్‌కు కేవలం టర్కీ మాత్రమే ఆయుధాలు అమ్మిందా? చైనా వెపన్స్ వాడట్లేదా? కేవలం టర్కీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది పాల్ ప్రశ్న. అమెరికా టాపిక్ కూడా తీసుకొచ్చారాయన. టర్కీనే ఆయుధాలు అమ్ముతోందా? అమెరికా ప్రపంచ దేశాలన్నిటితో వెపన్ బిజినెస్ చేయట్లేదా? లక్షల కోట్ల విలువైన ఆయుధ వ్యాపారం అమెరికా సొంతం అని అన్నారు.
తప్పంతా అమెరికాదే..
యూఎస్ ప్రెసిడెంట్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్నారని.. ఆ దేశానికి ట్రిలియన్ డాలర్ల ఆయుధాలు అమ్మేందుకే వెళ్లారని పాల్ చెప్పారు. సౌదీకి వెపన్స్ అమ్ముతూ.. ఇండియా, పాక్‌కు శాంతి వచనాలు చెబుతూ ట్రంప్ డబుల్ గేమ్ ఆడుతున్నారని అన్నారు. అమెరికా అటు పాకిస్తాన్‌తో, ఇటు ఇండియాతో బిలియన్ డాలర్ల వెపన్ బిజినెస్ చేస్తోందంటూ కేఏ పాల్ మండిపడ్డారు. ఇరు దేశాల మధ్య న్యూక్లియర్ వార్ జరిగి ఉంటే కోట్ల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారని అన్నారు. అందుకే, తాను శాంతి కోసం టర్కీకి వచ్చానని చెప్పారు. విమానాశ్రయంలో తనను ఆపాలని చూశారు కానీ అది వారి వల్ల కాలేదన్నారు. రష్యా, ఉక్రెయిన్ వార్ సమయంలో ఆయా దేశాలకు వెళ్లి శాంతి చర్చలు జరిపానని చెప్పారు. యుద్ధం సృష్టించే నాయకులు మనకు అవసరం లేదని.. యుద్ధాలను ఆపే తనలాంటి వాళ్లే నాయకులుగా ఉండాలని పాల్ పిలుపిచ్చారు. తినడానికి తిండిలేక కోట్ల మంది ప్రజలు ఆకలితో చస్తుంటే.. యుద్ధాలకు మాత్రం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని పాల్ మండిపడ్డారు. తనతో పాటు ప్రపంచ దేశాలకు చెందిన మరో 600 మంది శాంతి కోసం పని చేస్తున్నారని తెలిపారు. అయితే, తాను టర్కీలో ఉన్నానని పాల్ అంటున్నారు కానీ, నిజంగా టర్కీలోనే ఉన్నారని అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఓ గదిలో కూర్చొని ఆయన ఆ వీడియో చేశారు. ఆ గది టర్కీలో ఉందో.. ఇండియాలో ఉందో ఆయనకే తెలియాలి. టర్కీ అని పాల్ చెప్పారు కాబట్టి మనం నమ్మాలి అంతే.
Also Read : కరాచీ పోర్ట్ టార్గెట్‌గా INS విక్రాంత్.. గేమ్ ఛేంజర్
ఎవర్రా మీరంతా?
కేఏ పాల్ చెప్పిన ప్రతీ పాయింట్ ఆలోచించదగిందే. కాకపోతే, చెప్పింది పాల్ కాబట్టి మనం అస్సలు పట్టించుకోం. చూట్టానికి కామెడీ పీస్‌లా ఉంటారు కానీ.. కేఏ పాల్ చాలా సీరియస్ మనిషి. ఏ టాపిక్ అయినా సరే అనర్గళంగా మాట్లాడుతారు. ఆయన స్పీచ్‌లో తత్తరపాటు, తప్పులు గట్రా ఉండవు. విలేకర్లు ఎన్ని ప్రశ్నలు సంధించినా, ఎంతగా కౌంటర్లు వేసినా.. అదరరు, బెదరరు, తొనగరు. సూటిగా సమాధానాలు చెప్పగలరు. కాకపోతే, సుత్తి ఎక్కువగా ఉంటుంది. అది భరించాల్సిందే. కాస్త ఓపికగా ఆయన చెప్పింది వింటే.. టన్నుల్లో ఆనందం మన సొంతం అవుతుంది. ఇంకేం కామెడీ సిరీస్‌లు చూడాల్సిన అవసరం ఉండదు. పవన్ కల్యాణ్, జగన్, కేసీఆర్‌ల గురించి మాట్లాడుతారు.. అదే టైమ్‌లో మోదీ, ట్రంప్‌ల టాపిక్ తీసుకొస్తారు. ఆయన లోకల్‌గా అందుబాటులో ఉండే గ్లోబల్ లీడర్. మన దగ్గర అంత పరపతి లేకపోయినా.. ప్రపంచ దేశాల్లో తనకు ఫుల్ పాపులారిటీ ఉందంటూ ఆయన చెప్పుకుంటారు. జస్ట్ మాటలే కాదు.. ఇదిగో ఇప్పుడిలా టర్కీ వెళ్లి.. మిస్సైళ్లు ఆపేసి.. చెప్పినట్టే చేసి చూపించారు. దటీజ్ పాల్. ఎనీ డౌట్స్?
Dr. K.A Paul , Chairman Mahdi from Turkey and Prez Trump selling Military warfare equipment to Saudi Arabia. Millions are already dead in the Middle East and Trillions of dollars are wasted. STOP NOW stupid wars. Watch and share to all peace makers . pic.twitter.com/PhSaurL6VZ
— Dr KA Paul (@KAPaulOfficial) May 13, 2025