Pakistan Govt: ఆపరేషన్ సిందూర్‌లో జరిగిన నష్టం గురించి అంచనా వేయడం మొదలు పెట్టింది పాకిస్థాన్ ప్రభుత్వం. ఈ ఘటనలో యావత్తు కుటుంబసభ్యులను కోల్పోయి అనాధిగా మిగిలాడు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజాద్. ఈ కరుడు గట్టిన ఉగ్రవాదిని ఆదుకునేందుకు ఆ దేశ ప్రభుత్వం సిద్ధమైంది. ఆ ఘటనలో అజార్ ఫ్యామిలీ సభ్యులు 14 మంది మృతి చెందారు. ఒకొక్కరికి కోటి ఆయనకు రూ. 14 కోట్లు నష్టపరిహారంగా ఇవ్వాలని నిర్ణయించింది.
పాకిస్థాన్‌లో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజాద్‌తో సన్నిహితంగా ఉంటారు. ఆయనతో బంధం అలాంటిది. ఆర్మీ, ఐఎస్ఐ, చివరకు పోలీసులకు ఆయన ఎంత చెబితే అంతే. ఆయన మాటే వేదవాక్కు. అమెరికా సైతం ఆయనను ఉగ్రవాదిగా గుర్తించింది. పేరుకు మాత్రమే ఆయన్ని అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. సభ, సమావేశాల్లో ఆయన దర్శనం కంటిన్యూ ఇస్తున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో 26 మంది పర్యాటకులు చంపేశారు. దీనికి ప్రతీకారంగా దాయాది దేశం పాకిస్తాన్‌లో ఉగ్రవాది స్థావరాలను నేలమట్టం చేసేందుకు భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. మే ఏడున జరిగిన ఆపరేషన్‌లో 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ ఆపరేషన్‌లో 100 మంది ఉగ్రవాదులను హత మార్చినట్లు రక్షణ శాఖ వెల్లడించింది.
అందులో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబసభ్యులు ఆపరేషన్ సింధూర్ దాడుల్లో హతమయ్యారు. అజార్ ఫ్యామిలీకి చెందిన 14 మంది కుటుంబసభ్యులు చనిపోయారు. పాక్‌లో 12వ సిటీ బహవల్‌పుర్. జేషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన ఆపరేషన్ కేంద్రం ఈ సిటీలో లాహోర్‌కు కేవలం 400 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ALSO READ: పేర్లు మారితే నిజాలు మారవ్.. డ్రాగన్ కంట్రీపై భారత్ సీరియస్
ఆపరేషన్ సిందూర్ పై పాకిస్తాన్ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఎక్కువ మంది ఫ్యామిలీ సభ్యులను నష్టపోయిన మసూద్ అజార్‌కు నష్టపరిహారం కింద 14 కోట్ల రూపాయలు రానున్నాయి.
ఈ దాడుల్లో ఆయన సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అజార్ భార్య, మరదలు, మరో ఐదుగురు చిన్నారులు మృతి చెందినట్లు మసూద్ అజార్ వెల్లడించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అజార్ ఫ్యామిలీలో ఆయనొక్కరే మిగిలారు. ఘటన సమయంలో ఆయన ప్రశ్చాత్తపం చెందినట్టు వార్తలు సైతం లేకపోలేదు.
జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ పాకిస్తాన్‌లో ఎంత కీలకం అన్నది అర్థమవుతుంది. ఇలాంటి వ్యక్తిని భారత్ కు అప్పగించాలని డిమాండ్ చేస్తే ఆ దేశం అప్పగిస్తుందా? అన్నది డౌటే. గతంలో కాశ్మీర్‌లో జరిగిన చాలా ఘటనల్లో మసూద్ ప్రమేయముందని భారత్ పదేపదే చెప్పినా దాయాది దేశం పట్టించుకోలేదు. కుటుంబ సభ్యులు పోయినా, అజార్ మాత్రం కోటీశ్వరుడే.