Plane Crash In America: అమెరికాలో ఓ ప్రైవేటు విమానం కుప్పకూలడంతో ఘోర ప్రమాదం జరిగింది. అయితే గురువారం తెల్లవారుజామున శాన్ డియాగో పరిసర ప్రాంతాల్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో చాలా మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. విమాన ప్రమాదం ఎలా జరిగిందనే విషాదంపై దర్యాప్తు చేస్తునట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రత్యేక్షుల సాక్ష్యం ప్రకారం విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడం వల్లే విమానం కుప్పకూలినట్లు చెబుతున్నారు. అయితే ప్రమాద సమయంలో విమానం 8 నుంచి 10 మంది ప్రయాణికులు ఉండవచ్చని చెప్పారు. ప్రస్తుతానికి ప్రయాణికుల సంఖ్యను కచ్చితంగా చెప్పలేమన్నారు.
Also Read: హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ ఆంక్షలు .. భారతీయ విద్యార్థుల చదువులు ఆగిపోతాయా?
అయితే ప్రమాద జరిగిన పరిసరాల్లో ఎవరు గాయపడలేదని అధికారులు చెబుతున్నారు. విమానం ఆ ప్రాంతంలో క్రాష్ లాండ్ అయినప్పుడు జెట్ ఇంధనం కింద పడటంతో వీధికి ఇరువైపుల ఉన్న కార్లు తగలపడిపోయాయి అని తెలిపారు. అయితే కూలిపోయిన విమానం గురించి శాన్ డియాగో అధికారులు వివరాలను విడుదల చేయలేదు. అది మిడ్ వెస్ట్ నుంచి వస్తున్న విమానం అని మాత్రం చెప్పారు. శాన్ డియాగోలోని మెంట్గోమెరీ గిబ్స్ ఎయిర్ పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగినట్లు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో దాదాపు 15 ఇల్లు ధ్వంసం అయ్యాయి అని చెబుతున్నారు. విమానం కూలిపోయే సమయంలో చాలా పోగమంచు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.