BigTV English

WW2 Bomb: 1941నాటి బాంబు.. ఇప్పుడు పేల్చేశారు..

WW2 Bomb: 1941నాటి బాంబు.. ఇప్పుడు పేల్చేశారు..

 


Plymouth unexploded WW2 bomb
 

Plymouth unexploded WW2 bomb: రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబు బ్రిటన్‌లోని ప్లిమత్‌లో ఓ గార్డెన్‌లో దొరికింది. 500 కిలోల బరువున్న ఈ జర్మన్ తయారీ బాంబును సముద్రంలో పేల్చేశారు. సెయింట్ మైఖేల్ ఎవెన్యూలోని గార్డెన్‌లో మంగళవారం ఇది బయటపడింది. ఆ గార్డెన్ చుట్టూ 4300 భవనాలు ఉన్నాయి. పదివేల మంది నివసిస్తున్నారు.

బాంబును గుర్తించిన వెంటనే ఆ పరిసరాల నుంచి ప్రజలను తరలించారు. ఆర్మీలోని బాంబ్ నిర్వీర్య దళానికి చెందిన అత్యంత నిపుణులు దానిని పరిశీలించారు. జనావాసాలకు దూరంగా సముద్రంలో పేల్చివేయాలని నిర్ణయించారు.


Read more:యుద్ధం తర్వాత.. నెతన్యాహు ప్లాన్ ఏంటంటే..?

లారీలో ఆ బాంబును తరలించే మార్గంలో రైళ్లు, బస్సులను నిలిపివేశారు. ట్రాఫిక్‌ను సైతం మళ్లించారు. పడవ ద్వారా బాంబును సముద్రంలో 14 మీటర్ల లోపలికి తీసుకెళ్లి.. అక్కడ శుక్రవారం పేల్చివేశారు.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ప్లిమత్‌పై 1362 బాంబులు పడ్డాయని సిటీ మ్యూజియం అధికారులు తెలిపారు. ఆ బాంబులన్నీ పేలగా.. పేలని బాంబు ఇదొకటని వివరించారు. ఏప్రిల్ 22/23 1941లో ఈ బాంబును జారవిడిచి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×