BigTV English

PM Modi Russia Visit : రష్యా ఆర్మీలో పనిచేస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్!.. మోదీ కోరడంతో పుతిన్ నిర్ణయం

రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులందరినీ డిశ్చార్జ్ చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. అధ్యక్షుడు పుతిన్ ఇచ్చిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.

PM Modi Russia Visit : రష్యా ఆర్మీలో పనిచేస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్!.. మోదీ కోరడంతో పుతిన్ నిర్ణయం

PM Modi Russia Visit updates(Today’s international news): రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులందరినీ డిశ్చార్జ్ చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. అధ్యక్షుడు పుతిన్ ఇచ్చిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ విందు సందర్బంగా పుతిన్ ని రష్యా సైన్యంలో పనిచేసే భారతీయులను తిరిగి ఇండియా పంపించాలని ప్రధాని మోదీ కోరారని.. అందుకు పుతిన్ అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పుతిన్ నిర్ణయాన్ని రష్యా ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

Also Read: కారు ప్రమాదం తరువాత కొనఊపిరితో ఉన్న మహిళ హత్య.. డ్రైవర్ కూడా నిందితుడే!


రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య గత రెండు సంవత్సరాలు యుద్దం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధంలో రష్యా సైన్యం తరపున నేపాలీ, భారతీయులు పోరాడుతున్నారు. యుధ్దంతో ఇప్పటివరకు ఇద్దరు భారతీయులు, పది మంది నేపాలీలు చనిపోయారు. యుద్ధంలో పోరాడితే రష్యా ప్రభుత్వం అధిక వేతనం చెల్లిస్తుందని.. ఆశపడి భారత్ లోని పంజాబ్, హర్యాణా యువకులు, నేపాల్ యువకులు రష్యా సైన్యంలో చేరారు. కానీ వారికి చెప్పినంత వేతనం లభించడం లేదని.. ఏజెంట్ల చేతిలో మోసపోయామని చెబుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సహాయం చేయాలని భారత్, నేపాల్ పౌరులు కోరుతున్నారు. నేపాల్ లో అయితే ఈ విషయంపై నిరసనలు కూడా జరుగుతున్నాయి.

indians in russian army

ఇండియా నుంచి రష్యా సైన్యంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే ఏజెంట్లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. వీరంతా భారతీయులను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలిసింది. పట్టుబడిన ఏజెంట్ల ద్వారా ఇప్పటివరకు 35 మంది భారతీయులు.. రష్యాకు వెళ్లారని సమాచారం.

Also Read: ముంబైలో భారీ వర్షాలతో రెడ్ అలర్ట్.. రెండో రోజూ స్కూళ్లు, కాలేజీలు బంద్

ప్రధాని మోదీ రష్యాలో రెండు రోజుల పర్యటనపై వెళ్లారు. సోమవారం సాయంత్రం పుతిన్ ఇచ్చిన ప్రత్యేక విందులో ప్రధాని మోదీ భారతీయ సైనికులని రష్యా సైన్యం నుంచి డిశ్చార్చ్ చేయాలని కోరగా అందుకు పుతిన్ కోరినట్లు సమాచారం. ప్రత్యేక విందు సందర్భంగా పుతిన్.. మోదీని మూడవసారి ప్రధాన మంత్రిగా ఎన్నికైనందుకు అభినందించారు. ఇండియా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని.. రష్యా ఇండియా సంబంధాలు మరింత బలో పేతం చేస్తామని చెప్పారు.

రష్యా పర్యటనలో భాగంగా ఈరోజు ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం.. రష్యాలోని భారతీయ విద్యార్థి, వ్యాపార అసోసియేషన్ల ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగిస్తారు. సాయంత్రం తిరిగి పుతిన్ తో భద్రతా అంశాలపై రహస్య సమావేశంలో పాల్గొంటారు.

 

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×