BigTV English

PM Narendra Modi Austria Tour: యుద్ధ భూమిలో సమస్యలు పరిష్కారం కావు.. ప్రధాని మోదీ స్పష్టీకరణ

PM Narendra Modi Austria Tour: యుద్ధ భూమిలో సమస్యలు పరిష్కారం కావు.. ప్రధాని మోదీ స్పష్టీకరణ

PM Narendra Modi Austria Tour:  ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రియాలో పర్యటించారు. మొదట ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌తో ఉన్నతస్థాయి సమావేశమయ్యారు. అనంతరం ఇరు దేశాల అధినేతలు సంయుక్తం ప్రకటన విడుదల చేశారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆస్ట్రియాలో పర్యటించే అవకాశం రావడం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు.


ఆస్ట్రియా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. ఆ దేశ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌తో పలు అంశాలపై చర్చించారు. యుద్ధానికి ఇది సమయం కాదని మోదీ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని నేను గతంలో కూడా చెప్పానని, యుద్దం ద్వారా సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనలేమన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా అమాయకుల ప్రాణాలు కోల్పోవడం అంగీకార యోగ్యం కాదని తేల్చి చెప్పారు. భారత్, ఆస్ట్రియా కలిసి దౌత్యపరంగా సహకారం అందిస్తామని వెల్లడించారు.

ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండ్ వాండర్ బెల్లెన్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ మేరకు పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై ఇరు దేశాల మధ్య చర్చించారు. ఆస్ట్రియా పర్యటకు వచ్చినందుకు మోదీకి బెల్లెన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశం, ఆర్థికశక్తిగా వాతావరణ మార్పులపై పోరాటంలో భారత్ కీలక పాత్ర వహిస్తుందని కితాబిచ్చారు.


Tags

Related News

Minneapolis shooting: మినియాపొలిస్‌లో రక్తపాతం.. చర్చి స్కూల్‌పై రైఫిల్ దాడి.. అసలేం జరిగిందంటే?

Trump Statement: భారత్, పాక్ కి నేనే వార్నింగ్ ఇచ్చా.. మరింత గట్టిగా ట్రంప్ సెల్ఫ్ డబ్బా

Trump’s Tariff War: ట్రంప్ టారిఫ్ స్టార్ట్! భారత్‌కు కలిగే నష్టాలు ఇవే..

India Vs America: అమెరికాతో ఢీ అంటే ఢీ.. ట్రంప్ సుంకాల్ని వెనుక వ్యూహమేంటి?

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. నమ్మండి ఇది నిజం

Big Stories

×