E-Paper
Advertisement

PM Narendra Modi: ఉక్రెయిన్ సమస్యకు త్వరలోనే పరిష్కారం.. పుతిన్‌తో ప్రధాని మోదీ

PM Narendra Modi: ఉక్రెయిన్ సమస్యకు త్వరలోనే పరిష్కారం.. పుతిన్‌తో ప్రధాని మోదీ
Advertisement

PM Narendra Modi in Russia for 16th Brics Summit: శాంతిస్థాపనకు భారత్ సిద్ధంగా ఉందని, ఇదే తమ దేశ విధానమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. బ్రిక్స్ శిఖరాగ సదస్సులో పాల్గొనేందుకు రష్యాలోని కజాన్ నగరం వెళ్లిన ప్రధాన మంత్రి మోదీ.. అక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించారు.

వివాదాలకు శాంతియుత పరిష్కారాలను భారత్ విశ్వసిస్తుందని చెప్పారు. అన్ని వివాదాలు చర్చలతో పరిష్కరించుకోవాలన్నదే భారత్ విధానమని చెప్పారు.ఉక్రెయిన్ వివాదానికి వీలైనంత త్వరగా శాంతియుత పరిష్కారానికి మద్దతు ఇస్తామని మోదీ పునరుద్ఘాటించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ అంశంపై గతంలోనూ ప్రస్తావించినట్లు గుర్తు చేశారు.

Advertisement

సమస్యలను శాంతి యుత విధానంలో పరిష్కరించుకోవాలని మేబు భావిస్తున్నామని, శాంతి, స్థిరత్వం స్థాపనకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు. రాబోయే కాలంలో కూడా సాధ్యమైన అన్ని సహకారాలు అందించడానికి భారత్ సిద్దంగా ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ చెప్పారు.

Also Read: బుక్ ఫెయిర్‌లో కరువైన పుస్తక ప్రియులు.. అమ్ముడుపోయిన 35 పుస్తకాలు, 800 బిర్యానీలు!

Advertisement

కాగా, బ్రిక్స్ సదస్సుల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ప్రస్తుతం కజాన్ నగరంలో ఉన్నారు. గత మూడు నెలల వ్యవధిలో తాను రెండవసారి రష్యాలో పర్యటించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×