BigTV English

Blast in Tamilnadu : క్వారీలో భారీ పేలుడు.. నలుగురు మృతి

Blast in Tamilnadu : క్వారీలో భారీ పేలుడు.. నలుగురు మృతి

Blast in Tamilnadu Virudhunagar Quarry : తమిళనాడులో భారీ బాంబు పేలుడు సంభవించింది. విరుదునగర్ జిల్లా కారియాపట్టి సమీపంలోని అవియూర్ లోని క్వారీలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.


పేలుడు ధాటికి మృతదేహాలు ఎగిరిపడ్డాయి. క్వారీలో పేలుడు ఘటనతో కారియాపట్టి హైవేపై స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ పేలుడుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ క్వారీపై స్థానికులు కొన్నేళ్లుగా అధికారులకు ఫిర్యాదులు చేసినా.. పట్టించుకోవడం లేదు. క్వారీ నిర్వహించేవారు కనీస భద్రతా ప్రమాణాలను పాటించడం లేదని వాపోతున్నారు. పేలుడు ఘటనకు కొద్దినెలల క్రితమే క్వారీని తాత్కాలికంగా మూసివేసినట్లు సమాచారం. మళ్లీ క్వారీలో పేలుడు జరగడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.


Tags

Related News

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Big Stories

×