E-Paper
Advertisement

రెండు భారీ భూకంపాలు.. చిగురుటాకులా వణికిన వెనిజులా, కూలిన ఎత్తైన భవనాలు, మృతులు లక్ష వరకు..

రెండు భారీ భూకంపాలు.. చిగురుటాకులా వణికిన వెనిజులా, కూలిన ఎత్తైన భవనాలు, మృతులు లక్ష వరకు..
Advertisement

Venezuela: ప్రకృతి కన్నెర్ర జేసింది. దక్షిణ అమెరికాలోని వెనిజులాలో రెండు భారీ భూకంపాలు వణికించాయి. దాని ఫలితంగా ఆ దేశ రాజధాని కారకాస్‌ చిగురుటాకులా వణికిపోయింది. భూకంపం తీవ్రతకు ఎతైన భవనాలు ఊగిపోయాయి. భవనాల్లోని ప్రజలంతా భయంతో బయటకు పరుగులు తీశారు.

వెనిజులాను వణికించిన రెండు భారీ భూకంపాలు

Advertisement

వెనిజులాలో బుధవారం సాయంత్రం రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఒకదాని తర్వాత మరొకటి రావడంతో దేశ రాజధాని కారకాస్‌తో పాటు పలు ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోయాయి. భూకంపం ధాటికి కారకాస్‌లోని ఎత్తైన భవనాలు, ఇళ్లు నేల కూలాయి.

అమెరికా జియోలాజికల్ సర్వే నివేదిక మేరకు.. వెనిజులా కాలమాన ప్రకారం బుధవారం సాయంత్రం 6 గంటల తర్వాత వరుస భూకంపాలు సంభవించాయి. కారకాస్‌కు పశ్చిమాన మొరాన్ తీరప్రాంతం సమీపంలో తొలి భూకంపం సంభవించింది. ఇది భూమిలోని 13 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్టు తెలిపింది.

Advertisement

చిగురుటాకులా వణికిన రాజధాని కారకాస్.. కూలిన ఎత్తైన భవనాలు

రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో వచ్చినట్టు పేర్కొంది. తొలి భూకంపం వచ్చిన అర నిమిషం తర్వాత అత్యంత శక్తివంతమైన మరొక భూకంపం సంభవించింది. ఇది రెక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో నమోదు అయ్యింది. ఇది మొరాన్‌కు నైరుతి దిశగా భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో నమోదు అయినట్టు వెల్లడించింది. 125 ఏళ్ల వెనెజులా చరిత్రలో అత్యంత బలమైన భూకంపాల్లో ఒకటిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రాజధాని కారకాస్‌లో ఊగిపోతున్న భవనాల నుండి ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. భవనాలు గోడలు పేకమేడల్లా ఒక్కసారిగా కూలిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రకృతి కన్నెర్రను అక్కడి ప్రజలు వీధుల్లోకి వచ్చి మరీ చూశారు. వరుస భూకంపాల ప్రభావం కారకాస్‌పై తీవ్ర ప్రభావం చూపిందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఎటు చూసినా కూలిన భవనాలు కనిపించాయి.

ALSO READ: నిప్పులకుంపటిలా ఆకాశం.. ఫ్రాన్స్‌ను చుట్టేసిన ‘ఓమేగా బ్లాక్’.. 40 మంది మృతి 

కారకాస్ సిటీలో ఎటుచూసినా శిథిలమైన భవనాలు, ఇళ్లు, షాపులు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల భవనాల గోడలు కూలిపోయి లోపల ఫర్నిచర్ అంతా కనిపించాయి. ఫలితంగా కారకాస్ సిటీలో విద్యుత్, ఇంటర్నెట్ వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని ఆదేశం అంచనా వేస్తోంది.

ట్రుజిల్లో, యారాకుయ్, కారబోబో, మిరాండా, అరగువా, లా గుయిరాతో సహా రాష్ట్రాలను భూకంపాలు ప్రభావితం చేశాయని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. ప్రాథమిక అంచనా ప్రకారం మృతుల సంఖ్య 10 వేల నుంచి లక్ష వరకు ఉండే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. మరోవైపు గురువారం ఉదయం జపాన్‌లో ఇవతే తీరంలో భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై 6.9గా నమోదు అయ్యింది. అయితే జపాన్‌లో సునామీ ముప్పు లేదని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు.

 

Related News

ఇరాన్ ఇష్యూలో ట్రంప్ వెనక్కి.. అణు డీల్‌ లేకుండానే పుల్‌స్టాప్‌కు యత్నాలు, దీని వెనుక ఏం జరిగింది?

ఆగష్టు 12న నాలుగు ఖగోళ వింతలు.. ఆరు గ్రహాలు పరేడ్, అమావాస్యతోపాటు సూర్యగ్రహణం

రష్యా టు ఇండియా.. రైలు కనెక్టివిటీపై మాస్కో ప్రతిపాదన, అసలు కారణం అదే

అడవిలో కూలిన హెలికాప్టర్.. నలుగురి దుర్మరణం, ముగ్గురు టూరిస్టులు

మొజ్తబా ఖమేనీ బయటకు వచ్చారు.. ఇదిగో కొత్త వీడియో.. కొంతమందితో మాట్లాడుతూ

ట్రంప్ ప్రభుత్వం కొత్త పాలసీ.. టార్గెట్ H-1B వీసాదారులు, 60 రోజులు ఎత్తేసే అవకాశం

భారత్‌కు అమెరికా బిగ్ షాక్.. రష్యా నుంచి చమురు కొంటే 100% ట్యాక్స్.. బిల్లుకు సెనేట్ ఆమోదం!

థాయ్‌లాండ్ స్కూల్‌లో కాల్పుల కలకలం.. 8మంది మృతి-15 మందికి గాయాలు, నిందితుడు విద్యార్థే

Big Stories

Advertisement
×