E-Paper
Advertisement

టాయిలెట్ ట్యాంక్‌లో టూత్‌పేస్ట్ వేస్తే జరిగే మ్యాజిక్ ఇదే.. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా?

టాయిలెట్ ట్యాంక్‌లో టూత్‌పేస్ట్ వేస్తే జరిగే మ్యాజిక్ ఇదే.. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా?
Advertisement

Toilet Cleaning Hacks: నలుగురు సభ్యులు ఉన్న ఇంట్లో బాత్‌రూమ్‌ను ఎప్పుడూ శుభ్రంగా, తాజా సువాసనతో ఉంచడం పెద్ద పోరాటం అనే చెప్పాలి. అయితే బాత్రూమ్ క్లీనింగ్ కోసం ప్రతిసారీ కఠినమైన కెమికల్స్ వాడకుండా.. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే బాత్‌రూమ్‌ను నీట్‌గా ఉంచుకోవడానికి ఒక అద్భుతమైన చిట్కా ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ చిట్కా గురించి ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం పదండి..

టూత్‌పేస్ట్ ఎలా పనిచేస్తుంది?

టూత్‌పేస్ట్‌లో జిడ్డును వదిలించే, క్రిములను చంపే గుణాలు ఉంటాయి. ఒక చిన్న టూత్‌పేస్ట్ ట్యూబ్‌ను టాయిలెట్ ట్యాంక్‌లో వేస్తే చాలు.. మనం ఫ్లష్ చేసిన ప్రతిసారి కొద్దికొద్దిగా పేస్ట్ నీటిలో కలిసి టాయిలెట్‌ను క్లీన్‌గా, మంచి మింట్ వాసనతో ఉంచుతుంది.

కెమికల్ బిళ్లలు వాడితే ఏమవుతుంది?

Advertisement

చాలామంది టాయిలెట్ ట్యాంక్‌లలో ఘాటైన బ్లీచింగ్ టాబ్లెట్స్ వేస్తుంటారు. ఇవి ట్యాంక్ లోపల ఉండే రబ్బరు విడిభాగాలను, ప్లాస్టిక్ పార్ట్‌లను పాడుచేస్తాయి. దీనివల్ల వాటర్ లీకేజీలు మొదలవుతాయి. అదే టూత్‌పేస్ట్ అయితే ఎలాంటి రసాయనాలు లేకుండా పైపులను, ట్యాంక్‌ను సురక్షితంగా ఉంచుతుంది.

Also Read: రూ.13,000 బడ్జెట్‌లో ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో హాట్‌కేక్‌లా అమ్ముడవుతున్న Moto G06 Power!

దీన్ని ఎలా వాడాలి?

Advertisement

చిన్న డబ్బాలో తెల్లటి టూత్‌పేస్ట్ ట్యూబ్ తీసుకోండి. దానికి సూదితో అక్కడక్కడా 10 నుండి 15 చిన్న రంధ్రాలు చేయండి. దాన్ని టాయిలెట్ ట్యాంక్ వెనుక మూలలో పడేయండి. లోపల ఉండే ఫ్లాపర్ లేదా చైన్‌కి అది తగలకుండా చూసుకోండి. ఒక చిన్న ట్యూబ్ దాదాపు నెల రోజుల వరకు పనికొస్తుంది.

సింక్ జామ్ అయితే ఉప్పు చిట్కా:

బాత్‌రూమ్ సింక్‌లో సోప్ మురికి, జుట్టు పేరుకుపోయి నీళ్లు త్వరగా వెళ్లనప్పుడు ఉప్పు బాగా పనిచేస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు అర కప్పు ఉప్పును సింక్ హోల్‌లో వేసి వదిలేయండి. ఉదయాన్నే మరుగుతున్న నీళ్లను అందులో పోస్తే.. పైపుల్లో పేరుకుపోయిన జిడ్డు అంతా కరిగిపోయి డ్రెయిన్ క్లియర్ అవుతుంది.

Also Read: 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సరికొత్త Moto G Max.. లాంచ్ ఎప్పుడంటే?

Tags

Related News

స్లీపర్ బస్సుల్లో వరుస అగ్నిప్రమాదాలు..బస్సులో మంటలు చెలరేగితే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి?

లేడీస్ సేఫ్టీ అలెర్ట్..రాత్రి ప్రయాణాల్లో ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలు కాపాడతాయి!

కటింగ్ బోర్డును కేవలం నీటితో కడుగుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి!

వివాహ బంధంలో సమస్యలు.. విడాకుల పరిస్థితి నివారించడానికి 7 సూత్రాలు

స్టైలిష్‌గా కనిపించేందుకు బ్రాండెడ్ డ్రెస్‌ అవసరం లేదు.. తక్కువ బడ్జెట్‌లో ఫ్యాషన్ టిప్స్

“నాకు అదృష్టం లేదు”.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ తమ వైఫల్యాలకు విధిని నిందిస్తారు

మీ వయసు పదేళ్లు తగ్గిపోతుంది.. నిత్యయవ్వన చర్మం కోసం ఈ 7 సూపర్ జ్యూస్‌లు తాగండి

డోపమైన్ కోసం డేటింగ్.. ప్రేమలో కొత్తదనం కోరుకుంటున్న జెన్ జీ యువత

Big Stories

Advertisement
×