E-Paper
Advertisement

ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. రేట్లు ఇలా తగ్గించేశారేంటీ!

ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. రేట్లు ఇలా తగ్గించేశారేంటీ!
Advertisement

Flipkart Freedom Sale 2026: ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో ‘ఫ్రీడమ్ సేల్-2026’ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 8వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ సేల్ ఈ నెల 16వ తేదీ వరకూ కొనసాగనుంది. ప్రస్తుతం మెుబైల్స్, ఫ్రిడ్జ్ లు, ఏసీలు, టీవీలు ఇలా చాలా రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగా ఫోన్ కొనాలని భావిస్తున్న వారికి ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ బెస్ట్ ఆప్షన్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సేల్ లో భారీ ఆఫర్లతో లభిస్తున్న టాప్ మెుబైల్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

శాంసంగ్ గెలాక్సీ S25 5G

శాంసంగ్ గెలాక్సీ S25 5G (12GB ర్యామ్ + 128GB స్టోరేజ్) అసలు ధర రూ.74,999 కాగా.. ఈ సేల్‌లో రూ.62,999 కే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించే కస్టమర్లు రూ.3,625 వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు.

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్

Advertisement

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (256GB) వేరియంట్.. రూ.1,49,900 కి బదులుగా రూ.1,41,900 కి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై మరో రూ.8,000 స్పాట్ డిస్కౌంట్ అందిస్తున్నారు. అంతేకాకుండా పాత ఫోన్ మోడల్, కండిషన్ బట్టి గరిష్టంగా రూ.59,400 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది.

యాపిల్ ఐఫోన్ ఎయిర్

యాపిల్ ఐఫోన్ ఎయిర్ మోడల్ లాంచ్ ధర రూ.1,19,900 కాగా.. ప్రస్తుతం ఫ్రీడమ్ సేల్ లో రూ.1,01,900 లకే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.4,000 అదనంగా ఆదా చేసుకోవచ్చు. అర్హతను బట్టి ఈ ఫోన్‌పై కూడా రూ.59,400 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ వర్తిస్తుంది.

వన్‌ప్లస్ 15R 5G

Advertisement

వన్‌ప్లస్ 15R 5G (12GB ర్యామ్+ 256GB స్టోరేజ్) మోడల్ ధర రూ.54,999 ఉండగా.. సేల్‌లో రూ.44,006 కి విక్రయిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే మరో రూ.2,676 వరకు తగ్గింపు పొందొచ్చు.

Also Read: కేరళ To ఉత్తరాఖండ్.. ఆగస్టులో చూడాల్సిన 10 అద్భుతమైన టూరిస్ట్ ప్లేసెస్ ఇవే!

వివో ఎక్స్ 200 టీ

వివో X200T (12GB ర్యామ్ + 256GB స్టోరేజ్) మోడల్.. రూ.80,000 కి బదులు రూ.59,999 కే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులను ఉపయోగించి వినియోగదారులు రూ.3,475 వరకు అదనపు తగ్గింపును పొందే వెసులుబాటు ఉంది.

Also Read: హైదరాబాద్ ప్రజల వాస్తవాలు.. ఏడాదికి 200 గంటలు వృథా, ఊహించని విషయాలు

Tags

Related News

టెలికాం గేమ్‌ ఛేంజర్స్.. అసలు Local, STD, PCO అంటే ఏంటి? 1990’s జ్ఞాపకాలు!

హోటళ్లు-పబ్లిక్ ప్రాంతాల్లో వైఫై వినియోగం.. సైబర్‌ దాడులపై మైక్రోసాఫ్ట్ వార్నింగ్, తస్మాత్ జాగ్రత్త అంటూ..

వీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్తగా రూ.249, రూ.250 ప్లాన్స్ లాంచ్.. నిజంగా అదిరిపోయాయ్!

రూ.13,000 బడ్జెట్‌లో ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో హాట్‌కేక్‌లా అమ్ముడవుతున్న Moto G06 Power!

వర్షాకాలంలో ఇళ్లలోని నీరు, బురదను క్షణాల్లో.. క్లీన్ చేసే వాక్యూమ్ క్లీనర్స్!

7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సరికొత్త Moto G Max.. లాంచ్ ఎప్పుడంటే?

ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో.. టాప్ 5 ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు!

Big Stories

Advertisement
×