E-Paper
Advertisement

భారత్‌కు అమెరికా బిగ్ షాక్.. రష్యా నుంచి చమురు కొంటే 100% ట్యాక్స్.. బిల్లుకు సెనేట్ ఆమోదం!

భారత్‌కు అమెరికా బిగ్ షాక్.. రష్యా నుంచి చమురు కొంటే 100% ట్యాక్స్.. బిల్లుకు సెనేట్ ఆమోదం!
Advertisement

Russia Tariff Bill: రష్యా నుంచి అత్యధికంగా చమురు, సహజ వాయువును కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం సుంకాలు విధించే బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 86 ఓట్లు, వ్యతిరేకంగా 11 ఓట్లు రావడంతో బిల్లుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లైంది. ఈ బిల్లు పరిధిలోకి మెుత్తం 5 అగ్రదేశాలను అమెరికా చేర్చగా.. అందులో భారత్, చైనా ఉండటం గమనార్హం. దీంతో భారత్ పై 100 శాతం సుంకాలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సర్వాధికారాలు దక్కబోతున్నాయి.

బిల్లుకు ఆసక్తికరమైన పేరు

ఉక్రెయిన్ పై నిర్విరామంగా యుద్ధం చేస్తున్న రష్యాకు గట్టి గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో రష్యా టారిఫ్ బిల్లును అమెరికా రూపొందించిది. రష్యాపై బలంగా ఆంక్షలు విధించాలని పోరాడుతూ.. జులై 11న మరణించిన ఉక్రెయిన్ మద్దతుదారుడు, అమెరికన్ సెనేట్ లిండ్సే గ్రాహం పేరునే ఈ బిల్లుకు పెట్టింది. గ్రాహం మరణం తర్వాత సెనెట్‌లో ఆయన స్థానాన్ని చేపట్టిన ఆయన సోదరి డార్లిన్ గ్రాహం మాట్లాడుతూ.. ఈ కొత్త బిల్లు నేరుగా ‘రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను దెబ్బతీస్తుందని’ వ్యాఖ్యానించారు.

ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతు స్పష్టం

Advertisement

గత ఏడాది కాలంగా గ్రాహంతో కలిసి ఈ బిల్లు ఆమోదం కోసం శ్రమించిన డెమొక్రాట్ నాయకుడు రిచర్డ్ బ్లూమెంతల్ బిల్లు ఆమోదం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఉక్రెయిన్ నుంచి ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ, మాస్కో నుంచి పుతిన్ ఈ బిల్లు ఆమోద ప్రక్రియను వీక్షించే ఉంటారు. బహుశా లిండ్సే గ్రాహం కూడా పైనుంచి ఇదంతా గమనిస్తున్నారని భావిస్తున్నాను’ అని అన్నారు. అయితే ఈ పోరాటంలో ఉక్రెయిన్ ప్రజలు ఒంటరి కాదని, పుతిన్ ఎప్పటికీ వారి దేశాన్ని లొంగదీసుకోలేరని బ్లూమెంతల్ స్పష్టం చేశారు. కాగా, ఈ బిల్లు తదుపరి ఆమోదం కోసం.. ఆగస్టు 31న సమావేశమయ్యే ‘హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్’ ముందుకు వెళ్లనుంది. అక్కడ కూడా ఆమోదం పొందితే.. చట్టరూపం దాల్చనుంది.

Also Read: ఇంటి పైకప్పుపై గార్డెన్.. ఇక లైఫ్‌లో ఏసీలు, కూలర్లు అక్కర్లే.. బోలెడన్ని బెనిఫిట్స్!

బిల్లులోని కీలక అంశాలు

Advertisement

ఇదిలా ఉంటే రష్యా ఆర్థిక రంగాన్ని దెబ్బతీసే అనేక అధికారాలను ఈ బిల్లు అమెరికా అధ్యక్షుడికి అందించనుంది. రష్యా నుంచి చమురు లేదా సహజ వాయువును అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న మొదటి ఐదు దేశాలపై 100% వరకు సుంకాలు విధించే అధికారాన్ని ఈ బిల్లు అధ్యక్షుడికి కట్టబెట్టనుంది. ప్రస్తుతం ఈ జాబితాలో భారత్, చైనాతో పాటు అజర్ బైజాన్, హంగేరీ, స్లొవేకియా దేశాలు ఉన్నాయి. అయితే ఈ బిల్లులో కొన్ని మినహాయింపులను సైతం చేర్చారు. రష్యా నుంచి తమ మొత్తం సహజ వాయువు దిగుమతుల్లో 15 శాతం కంటే తక్కువగా దిగుమతి చేసుకుంటూ ఆ దిగుమతులను తగ్గించుకోవడానికి చర్యలు తీసుకుంటున్న దేశాలకు ఈ బిల్లు నుంచి మినహాయింపు లభించనుంది.

Also Read: ఘాట్ రోడ్డులో ఘోరం.. లోయలో పడ్డ బస్సు.. 8 మంది స్పాట్ డెడ్!

Tags

Related News

దక్షిణాఫ్రికాలో ఘోరం.. అర్ధరాత్రి ఇంట్లోకి జొరబడి కాల్పులు.. 11 మంది దుర్మరణం!

షార్జాలో NRI దారుణహత్య.. శరీరాన్ని 9 భాగాలు చేసి, జాడలేని భార్య-కొడుకు

ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి.. ఈసారి ఎయిర్‌లైన్స్ వంతు, బుధవారం నుంచి కొత్త ఆంక్షలు

వైట్‌హౌస్‌లో ఆ మూడు మీడియా సంస్థలపై బ్యాన్.. డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!

సింగపూర్ తీరంలో షిప్‌లు ఢీ.. ఎగిరిపడ్డ కార్మికులు, వీడియో వైరల్

కెనడాలో విమాన ప్రమాదం.. ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ మృతి, ఎలా జరిగింది?

రియాద్‌పై హౌతీల మిసైల్ ఎటాక్.. మిడిల్ ఈస్ట్‌లో హై అలర్ట్!

మాస్కోపై ఉక్రెయిన్ మెగా అటాక్.. 1,000కి పైగా డ్రోన్లతో రష్యాకు భారీ షాక్

Big Stories

Advertisement
×