Big Stories

Indonesia’s new president: అప్పుడు ఆర్మీలో పనిచేశాడు.. ఇప్పుడు దేశానికే అధ్యక్షుడయ్యాడు

Prabowo Subianto elected: ఇండోనేషియా దేశ నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికయ్యారని ఆ దేశానికి చెందిన ఎన్నికల సంఘం అధికారంగా ప్రకటించింది. దేశ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన ప్రబోవో అక్టోబర్ నెలలో బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, ఆయన ఎన్నికను ఎన్నికల సంఘం గత నెల 20నే ప్రకటించింది. ఎన్నికల్లో ప్రబోవోకు 58.6 శాతం ఓట్లు వచ్చాయంటూ తెలిపింది.

- Advertisement -

అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అధ్యక్ష పదవికి పోటీ పడిన మరో ఇద్దరు నేతలు అనీస్ బస్వెదన్, గంజర్ ప్రనోవోలు అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం అనుచితంగా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుందంటూ వారు విమర్శిస్తూ సుబియాంతో ఎన్నికను వారు సవాల్ చేస్తూ న్యాయస్థానానికి వెళ్లారు. అయితే, వారి పిటిషన్లు న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతం రక్షణ మంత్రిగా సుబియాంతో ఉన్నారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. అదేవిధంగా ఇండోనేషియా ఆర్మీలో సుబియాంతో ఆర్మీగా పనిచేశారు.

- Advertisement -

Also Read:ఆశ్చర్యానికి గురి చేసిన యూరోప్ వాతావరణం.. నారింజ రంగులోకి మారిన ఏథెన్స్..

ఇండోనేషియా అధ్యక్ష పదవికి ఎన్నికలు ఫిబ్రవరి 14న జరిగాయి. అయితే, అధ్యక్ష పదవికి ప్రబోవో సుబియాంతో మూడు సార్లు పోటీ పడగా ఈసారి ఎన్నికయ్యారు. రెండుసార్లు ఆయన విడోడో చేతిలో పరాజయం చవి చూశారు. ఈ సంవత్సరం అక్టోబర్ మాసంలో నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News