Big Stories

Putin Praises Modi : ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసల వర్షం..

Putin Praises Modi : ప్రధాని మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత విదేశాంగ విధానం అద్భుతమని ప్రశంసించారు. వాల్దాయ్ క్లబ్ వార్షికోత్సవంలో ప్రసంగించిన పుతిన్.. రష్యా, భారత్ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంతర్జాతీయంగా అనేక ఒత్తిళ్లు ఎదురైనా విజయవంతంగా అధిగమించి ముందుకు సాగుతున్న భారత్ ను అభినందనలతో ముంచెత్తారు పుతిన్. భారత్, రష్యా దేశాల మధ్య ప్రత్యేక అనుబంధం ఉందన్న పుతిన్.. ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య ఎలాంటి సమస్యలూ లేవన్నారు. మోదీ నేతృత్వంలో భారత్ అభివృద్ధి చెందుతోందన్నారు.

- Advertisement -

భారత్ అనుసరిస్తున్న మేకిన్ ఇండియా విధానంపైనా పుతిన్ అభినందించారు. మేకిన్ ఇండియా ఆర్థిక వ్యవస్థకు, నైతిక నియమావళికి నిదర్శనంగా కొనియాడారు పుతిన్. ప్రధానమంత్రి మోదీని గొప్ప దేశభక్తుడిగా పుతిన్ అభివర్ణించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా స్వతంత్రంగా విదేశాంగ విధానం అవలంభిస్తున్నారని మెచ్చుకున్నారు. రష్యా నుంచి భారత్ కు ఎరువుల ఎగుమతులను పెంచుతామని పుతిన్ స్పష్టం చేశారు.

- Advertisement -

అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యాను ఏకాకిగా చేయాలని అమెరికా సహా అనేక దేశాలు యత్నించిన సమయంలోనూ భారత్ సంయమనం పాటించింది. ఉక్రెయిన్ తో యుద్ధం విషయంలో అమెరికా ఒత్తిడి తెచ్చినా భారత్ తలొగ్గలేదు. ఇలాంటి నేపథ్యంలోనూ రష్యా నుంచి చమురు కొనుగోలుచేసింది. ఐక్య రాజ్య సమితిలో జరిగిన ఓటింగ్ లోనూ భారత్ దూరంగా ఉంది. భారత విదేశాంగ విధానంపై ఎలాంటి ఒత్తిళ్లూ లేవని నిరూపించింది. ఈ విషయంలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా అనేక సార్లు భారత విదేశాంగ విధానంపై ప్రశంసలు కురిపించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News