BigTV English

Christmas Island : క్రిస్మస్ దీవిలో ఎర్రపీతల సందడి

Christmas Island : క్రిస్మస్ దీవిలో ఎర్రపీతల సందడి

Christmas Island : క్రిస్మస్ ఐలాండ్.. ఎర్ర పీతలకు అతి పెద్ద ఆవాసం. ఈ దీవికి సమీపంలోని కొకోస్ ఐలాండ్స్‌లోనూ ఈ పీతలు స్వల్పసంఖ్యలో కనిపిస్తాయి. క్రిస్మస్ సమయంలో ఇవి లక్షల సంఖ్యలో బయటకొస్తాయి. దీవిలో దట్టమైన అడవుల్లోని తమ ఇళ్లను వదిలి తమ ఇళ్లను వదిలి హిందూమహాసముద్ర తీరం వైపు చకచకా అడుగులేస్తాయి.


ఏటా వానాకాలం ఆరంభంలో జరిగే ఈ మాస్ మైగ్రేషన్ నిజంగా ప్రకృతి అద్భుతమే. ఎటుచూసినా ఎర్రటి పీతలతో క్రిస్మస్ ఐలాండ్ నిండిపోతుంది. ఆస్ట్రేలియాలో డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు వెట్ సీజన్. జత కలిసేందుకు, గుడ్లు పెట్టేందుకు పీతల వలస సాగుతుంది.

ఆస్ట్రేలియా ప్రధాన భూభాగం నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో, ఇండొనేసియా జావా దీవుల నుంచి 350 కిలోమీటర్ల దూరంలో క్రిస్మస్ ఐలాండ్ ఉంది. పీతల మూకుమ్మడి వలస సజావుగా సాగేందుకు ఎన్నో నెలల ముందే నుంచే క్రిస్మస్ ఐలాండ్‌ నేషనల్ పార్క్ సిబ్బంది కసరత్తు ఆరంభమవుతుంది.


కిలోమీటర్ల పొడవునా రహదారుల పక్కన తాత్కాలిక బ్యారియర్లు ఏర్పాటు చేస్తారు. బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిల మీదుగా పీతలు రోడ్లు దాటుతాయి. ఇలాంటి వసతి లేని చోట్ల రహదారులను పూర్తిగా మూసేస్తారు. పీతల మైగ్రేషన్‌కు ప్రధాన అవరోధం పసుపుపచ్చ చీమల నుంచే ఎదురవుతుంది. ఆ చీమల నుంచి పీతలను కాపాడేందుకు పార్క్ సిబ్బంది ముందు నుంచే అన్ని చర్యలు తీసుకుంటారు.

1920లో తొలిసారిగా ఈ చీమలను క్రిస్మస్ ఐలాండ్‌లో గుర్తించారు. ఆరుదశాబ్దాల అనంతరం అవి భారీ సంఖ్యలో కాలనీలను ఏర్పాటు చేసుకున్నాయి. ఆ తర్వాతే ఎర్ర పీతల జనాభా తగ్గడం ఆరంభమైంది. చీమలు వెదజల్లే ఫార్మైక్ యాసిడ్(formic acid)కు లక్షల సంఖ్యలో పీతలు అంతరించిపోయాయి. అయితే శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఈ చీమల కట్టడి సాధ్యమైంది. దాంతో ఎర్రపీతల జనాభా గణనీయంగా పెరిగింది.

గత ఐదేళ్లలోనే ఇవి 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెరిగాయి. తొలకరి జల్లులు పడిన వెంటనే ఇవి లక్షల సంఖ్యలో తమ గూళ్లను వదిలి వలసబాట పడతాయి. చంద్రుడు, సముద్ర అలలు, వాతావరణాన్ని అనుసరించి ఈ మైగ్రేషన్ సాగుతుంది. పీతలు సముద్ర తీరానికి చేరుకుని జత కలుస్తాయి. మగ పీతలు తీరం వెంబడి ఇసుకను తొలిచి ‘డెన్’లను ఏర్పాటు చేస్తాయి. అనంతరం తిరిగి తమ ఇళ్లకు చేరతాయి.

ఆడ పీతలు మాత్రం అక్కడ గుడ్లు పెట్టి.. పొదిగిన తర్వాతే వెనుదిరుగుతాయి. ఒక్కో పీత లక్ష వరకు గుడ్లు పెడుతుంది. సముద్ర అలలు, వాతావరణం, షార్క్ చేపల కారణంగా అధిక భాగం గుడ్లు పొదిగే అవకాశం లేక వృథా అవుతాయి. దశాబ్ద కాలంలో ఒకటి, రెండు సార్లు మాత్రం గుడ్లన్నీ పిల్లలుగా మారేందుకు అవకాశం ఉంటుంది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×