BigTV English

Relief for Trump: ట్రంప్‌నకు భారీ ఊరట.. ఆ కేసు కొట్టివేత

Relief for Trump: ట్రంప్‌నకు భారీ ఊరట.. ఆ కేసు కొట్టివేత

Federal judge dismisses donald trump classified documents case: అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నకు భారీ ఊరట లభించింది. రహస్య పత్రాలకు సంబంధించిన కేసును ఫ్లోరిడా న్యాయస్థానం కొట్టివేసింది. అభియోగాలు దాఖలు చేసిన ప్రత్యేక న్యాయవాదిని చట్టవిరుద్ధంగా నియమించారంటూ ట్రంప్ తరఫు అడ్వకేట్ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. నేరాభియోగాల విచారణల నుంచి మాజీ అధ్యక్షులకూ మినహాయింపు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. తీర్పు వచ్చిన కొద్ది రోజులకే మరో కేసులోనూ ట్రంప్ నకు భారీ ఉపశమనం లభించింది.


ఇదిలా ఉంటే.. అధ్యక్ష ఎన్నికల్లో ప్రజాతీర్పును మార్చివేసేందుకు ప్రయత్నించారనే అభియోగాలను ఎదుర్కొన్న ట్రంప్ నకు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించిన విషయం తెలిసిందే. నేరాభియోగాల విచారణల నుంచి మాజీ అధ్యక్షులకు మినహాయింపు ఉంటుందంటూ ధర్మాసానం చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును 9 మందితో కూడిన ధర్మాసనంలో ఆరుగురు న్యాయమూర్తులు సమర్థించగా, ముగ్గురు వ్యతిరేకించారు.

Also Read: ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ షాక్.. పీటీఐ పార్టీపై నిషేధం


అయితే, బాలెట్ పత్రాల్లో ట్రంప్ పేరు చేర్చవద్దన్న కింది కోర్టు తీర్పును నిలిపివేసిన తరువాత ట్రంప్ నకు అనుకూలంగా సుప్రీంకోర్టులో వెలువడిన మరో తీర్పు ఇది. అమెరికా రాజ్యాంగంలో పొందుపరిచిన అధికారాల విభజనను అనుసరించి ప్రస్తుత అధ్యక్షునికి ఉన్న విధంగానే మాజీ అధ్యక్షుడికి కూడా నేరాభియోగ విచారణ నుంచి సంపూర్ణ మినహాయింపు ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ తీర్పులో పేర్కొన్న విషయం తెలిసిందే. అధ్యక్షుని అధికారిక చర్యలు అన్నిటికీ విచారణ నుంచి రక్షణ ఉంటుందన్నారు. అనధికారిక చర్యలకు మాత్రం మినహాయింపు ఉండబోదని స్పష్టం చేశారు. అయితే, ఈ తీర్పుపై ట్రంప్ స్పందిస్తూ.. మన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఇది భారీ విజయమన్నారు. అమెరికా పౌరుడిగా తాను గర్విస్తున్నానన్నారు.

కాగా, ఈ తీర్పు వచ్చిన కొద్ది రోజులకే మరో కేసులోనూ ట్రంప్ నకు భారీ ఉపశమనం లభింటినట్లయ్యింది.

Related News

Greece Population: గ్రీస్ లో జనాభా సంక్షోభం.. పిల్లలు లేక స్కూల్స్ మూసివేత

SCO Summit 2025: మోడీ, జిన్‌పింగ్, పుతిన్ దెబ్బ.. భారత్ పై ట్రంప్ యూ టర్న్?

Sudan: సూడాన్‌లో ఘోరం.. ప్రకృతి బీభత్సం, 1000కి పైగా మృతి

Modi Putin BIG Meeting: నిన్న జిన్‌పింగ్, ఇవాళ పుతిన్‌తో.. మోదీ బిగ్ మీటింగ్స్..

Trump Tariffs: కత్తులు నూరుతూ.. భారత్ పై ట్రంప్ లాస్ట్ అస్త్రం ఇదేనా!

Afghanistan Earthquake: ఆఫ్థాన్‌లో వరుస భూకంపాలు, మృతులు 250 మందికి పైగానే?

Big Stories

×