Big Stories

Telangana Phone Tapping Case: ఖాకీలు కాదు వాళ్లు.. ఖతర్నాక్ రౌడీలు.. తెరపైకి బీఆర్ఎస్ పెద్దల పేర్లు!

- Advertisement -

Telangana Phone Tapping Case: వాళ్లు ఖాకీలు కాదు.. ఖతర్నాక్‌ రౌడీలు.. ప్రభుత్వ పెద్దలు చెప్పిందే వారికి వేదం. చట్టాన్ని చుట్టంగా మార్చుకొని.. ప్రజల కోసం కాకుండా.. అమాత్యుల కోసం పనిచేసి.. ఇప్పుడు కటకటాల్లోకి వెళ్లారు. అయితే ఖాకీ డ్రెస్‌ను అడ్డంగా పెట్టుకొని చేసిన దారుణాలు, దందాల గుట్టు రట్టైంది. విపక్ష నేతలనే కాదు.. ఇంకా చాలా అంశాలపై జరిగిందీ ఈ ట్యాపింగ్‌ దందా. అంతేకాదు కొందరు సూత్రధారుల పేర్లు కూడా బయటికి వచ్చాయి.

- Advertisement -

ఇప్పటివరకు మనమనుకున్నదేంటి.. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారు. కానీ విషయం మరింత ఉంది. తవ్వుతున్న కొద్ది అన్ని షాకింగ్ విషయాలే. ప్రణీత్‌ రావు, భుజంగరావు, తిరుపతన్న కీ ప్లేయర్లు కాగా.. ఈ ట్యాపింగ్‌ టీమ్‌కు కెప్టెన్లుగా వ్యవహరించింది. SIB మాజీ చీఫ్‌ ప్రభాకర్ రావు.. మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు.. వీరు నేతల ఫోన్లు మాత్రమే కాదు. రియల్ ఎస్టేట్‌ పెద్దలు.. వ్యాపారులు, హవాలా చేసేవారిని కూడా.. టార్గెట్ చేసింది ఈ ట్యాపింగ్ ముఠా.

ఏం చేస్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? తమ పార్టీ నేతలను ఏమైనా సంప్రదిస్తున్నారా? ఎవరెవరు ఏ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు? ఇలా కొన్ని డౌట్స్‌తో నేతల ఫోన్లను ట్యాప్ చేశారనుకుందాం. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, హవాలా దందా చేసే వారి ఫోన్లను ట్యాప్‌ చేయడం ఎందుకు? ఇప్పుడీ క్వశ్చనే కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి అప్పుడు టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి ఆరోపణలను రిమైండ్ చేసుకోవాలి.

Also Read: ఇంటిపేరు కల్వకుంట్ల.. కేరాఫ్ అడ్రస్ స్కాములంట..

ఇవే అప్పుడు ఆయన చేసిన అలిగేషన్స్. అప్పటి అలిగేషన్స్‌కు.. ఇప్పుడు బయటపడుతున్న విషయాలకు లింక్‌ ఉన్నట్టు అనిపిస్తోంది కదూ. ఫండ్స్‌ మరే ఇతర పార్టీకి వెళ్లకుండా అడ్డుకోవడం ఫస్ట్ టార్గెట్ అయితే.. ఆ ఫండ్స్‌ మొత్తం బీఆర్‌ఎస్‌కే రావడం సెకండ్ టార్గెట్‌. ఇదే కాన్సెప్ట్‌తో ట్యాపింగ్‌ దందా కొనసాగిందన్న ఆరోపణలకు ఇప్పుడు బలం చేకూరింది. 36 మంది రియల్ఎస్టేట్‌ బిల్డర్లు.. జ్యువెలరీ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ఇదీ అఫిషియల్ ఇన్ఫర్మేషన్‌.. ఫోన్లు చేయడం.. డబ్బులు డిమాండ్ చేయడం.. ఫలానా నేతతో ఎందుకు మాట్లాడుతున్నావని బెదిరించడం. ఇవీ ఇప్పటి వరకు తెలిసిన విషయాలు.. మరిన్ని విషయాలు బయటికి రావాల్సి ఉంది.

ప్రస్తుతం విచారణలో నోరు తెరుస్తున్నారు అధికారులు.. SIB చీఫ్‌ ప్రభాకర్‌ రావు చెప్తేనే ఫోన్ ట్యాప్‌ చేశారు. భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన నెంబర్స్‌ కూడా ట్యాప్ చేశాను. మా కాన్సన్‌ట్రేషన్‌ మొత్తం నేతల కదలికలు, నిధుల సమీకరణ.. సోసైటీ పెద్ద మనుషులుగా చలామణీ అవుతున్న కొందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశాం. చేసిందంతా ఉన్నతాధికారులు చెప్పారనే.. ఇదీ పోలీసుల విచారణలో SIB మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు చెప్పిన విషయాలు. అంతేకాదు హార్డ్‌ డిస్క్‌లు ఎందుకు పనికిరాకుండా డిస్ట్రాయ్ చేసి.. ఆ ముక్కలను వెళ్లి మూసీలో నిమజ్జనం చేశామన్నారు ప్రణీత్‌రావు.

మరో కీలక అధికారి కూడా భుజంగరావు కూడా నోరు తెరుస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ కీలక నేత ఇచ్చిన నెంబర్స్‌ను మాత్రమే ట్యాప్‌ చేశాను. ఆ నేతలిచ్చిన నంబర్స్‌.. ప్రణీత్‌రావుకు.. ప్రణీత్‌రావు ఇచ్చిన ఇన్ఫోని.. మళ్లీ బీఆర్‌ఎస్‌ నేతకు అందించాడు. ఈ ఆపరేషన్ అంతా ఎలా జరిగిందో విచారణలో పూసగుచ్చినట్టు చెప్పారు భుజంగరావు.

Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. బీఆర్ఎస్ నేతలకు నోటీసులు..!

సో.. ఇద్దరి స్టేట్‌మెంట్స్‌ను చూస్తే.. బీఆర్‌ఎస్ నేతలు, ఖాకీ పెద్దలు, వీరి డైరెక్షన్‌లోనే జరిగింది ఈ దందా అంతా. ప్రస్తుతం రాధాకిషన్‌ రావు, ప్రభాకర్‌ రావులో యూఎస్‌లో ఉన్నారు. కానీ ఇక్కడ ఇన్వెస్టిగేషన్‌ మాత్రం ఆగడం లేదు.

మనం ముందు నుంచే చెబుతున్నాం. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో వీళ్లంతా పాత్రధారులే.. సూత్రధారులు ఇంకా వేరే వాళ్లు ఉన్నారని. ఇప్పుడదే నిజమైంది. ప్రణీత్‌రావు నోటి నుంచి ఇప్పటికే పలువురు కీలక నేతల పేర్లు వచ్చాయని తెలుస్తోంది.
బీఆర్‌ఎస్‌లో కీలకంగా ఉన్న ఆ నేతలకు త్వరలోనే నోటీసులు వెళ్లనున్నాయి. మరి వారి నోటి నుంచి ఎలాంటి ఆన్సర్స్‌ వస్తాయి. అనేది ఇప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్‌గా మారింది.

కానీ ఇక్కడ సమాధానం రావాల్సిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వ్యాపారులను ఎందుకు బెదిరించారు? అలా బెదిరించి వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి చేరాయి? ఎవరికి చేరాయి ? ఎవరి డైరెక్షన్‌లో ఇదంతా జరిగింది ? అనేది ఇప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్‌గా మారింది. ప్రస్తుతం పోలీసుల స్పీడ్‌ చూస్తుంటే.. అతి త్వరలో వీటికి కూడా ఆన్సర్స్‌ బయటపడటం.. కొందరు గులాబీ పెద్దలు శ్రీకృష్ణజన్మస్థానానికి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News