BigTV English

Rupert Murdoch marries 5th time: 93 ఏళ్లలో ఐదో పెళ్లి, మీడియా టైకూన్ రూపర్ట్

Rupert Murdoch marries 5th time: 93 ఏళ్లలో ఐదో పెళ్లి, మీడియా టైకూన్ రూపర్ట్

Rupert Murdoch marries 5th time: మీడియా మొఘల్, అంతర్జాతీయ మీడియా దిగ్గజం రూపర్ట్ మర్దోక్ ఐదోసారి మ్యారేజ్ చేసుకున్నారు. 93 ఏళ్ల ఆయన, వయసులో తనకంటే 25 ఏళ్ల చిన్నవారైన బయాలజిస్ట్ ఎలీనా జుకోవాను మ్యారేజ్ చేసుకున్నారు.


అమెరికాలోకి కాలిఫోర్నియా సొంత ఎస్టేట్‌లో శనివారం వీరి పెళ్లి జరిగింది. సంప్రదాయబద్దంగా జరిగిన ఈ మ్యారేజ్‌కు అమెరికాలోకి కొంతమంది వ్యాపారవేత్తలు హాజరైనట్టు తెలుస్తోంది. అమెరికా ఫుట్‌బాల్ టీమ్ యజమాని రోబెర్ట్ క్రాఫ్ట్, ఆయన వైఫ్ డానా బ్లూమ్‌బెర్గ్ హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

రూపర్ట్ మర్దోక్ మొదట ఆస్ట్రేలియాకు చెందిన పాట్రిషియా బుకర్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 1960ల్లో వీరి మధ్య బంధం ముగిసింది. ఆ తర్వాత జర్నలిస్టు అన్నామారియా‌మన్, చైనా వ్యాపార వేత్త విన్ డీ డెంగ్, అమెరికా మెడల్ జెర్రీ హాల్‌తో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఎలీనా ఐదో వ్యక్తి.


ఇదిలావుండగా మర్దోక్ మూడో భార్య విన్ డీ డెంగ్ ఉన్నప్పుడే వీరి మధ్య రిలేషన్‌షిప్ మొదలైంది. చివరకు పెళ్లికి దారితీసింది. రష్యాలో పుట్టిన ఎలీనా, ఆ తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు.

ALSO READ: ఇక నుంచి ఈ దేశం పోవడం కష్టమే..?

ఎలీనా జుకోవా మొదటి భర్త బ్రిటీష్ వ్యక్తి, బిజినెస్‌మేన్ అలెగ్జాండర్ జుకోవ్. వీరిద్దరు కలిసి అప్పటి సోవియట్ యూనియన్‌లో ఓ యూనివర్సిటీలో విద్యార్థులుగా ఉన్నారు. ఆ తర్వాత పరిచయం కాస్త పెళ్లికి దారి తీసిందని అమెరికా మీడియా పేర్కొంది.

Tags

Related News

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Big Stories

×