BigTV English

Preity Zinta: నా సినీ కెరీర్‌లో కఠినమైన చిత్రమిదే!

Preity Zinta: నా సినీ కెరీర్‌లో కఠినమైన చిత్రమిదే!

Preity Zinta Wraps Shooting for ‘Lahore 1947’: బాలీవుడ్ నటి ప్రీతీ జింటా.. ఆరేళ్ల విరామం తర్వాత “లాహోర్ 1947” సినిమాతో  మళ్లీ వెండితెరపైకి రానుంది. సన్నీ దేవోల్ సరసన ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాని డైరక్టర్ రాజ్ కుమార్ సంతోషి తెరకెక్కించబోతున్నారు. అగ్రకథానాయకుడు అమీర ఖాన్ తన బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందాజ్ అప్నా (1994) తర్వాత అమీర్, రాజ్‌కుమార్ సంతోషి కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి.


తాజాగా ఈ సినిమాలో ప్రీతి జింటా పాత్ర చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని తెలుపుతూ.. ప్రీతి జింటా తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఈ సినిమాలో నా పాత్రకు సంబంధించిన షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. 1947లో లాహోర్ లో జరిగిన సంఘటనలన్నీ అద్బుతంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. నా కెరియర్ లో ఇంతవరకు నటించిన సినిమాల్లో ఈ సినిమానే అత్యంత కష్టతరమైన చిత్రం అని తెలిపింది.

ఇంకా.. ఈ సినిమా ద్వారా అధ్బుతమైన అనుభవాన్ని అందించినందుకు రాజ్‌కుమార్, అమీర్ ఖాన్, సన్నీ డియోల్, షబానా అజ్మీ సంతోష్ శివన్ & ఏఆర్ రెహమాన్‌లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అభిమానులకు మనస్పూర్తిగా ఈ సినిమా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను అని రాసుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.


Also Read: పుస్తకం పట్టి పిచ్చెక్కిస్తున్న దివి!

ఈ పోస్ట్‌పై రాజ్‌కుమార్ సంతోషి కుమార్తె, నటి తనీషా సంతోషి స్పందిస్తూ, “ఎప్పటికీ మీ అభిమాని అమ్మాయి” అని అన్నారు.

ఇక కెరీర్ పరంగా.. ప్రీతి తన అద్భుతమైన నటనా నైపుణ్యంతో తనదైన ముద్ర వేసుకుని సహాయ నటిగా కూడా తన ఉనికిని చాటుకుంది. ప్రీతి జింటా సినిమాల్లోనే కాకుండా పలు వాణిజ్య ప్రకటనలోను నటించింది. ఇక బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులోను ప్రేమంటే ఇదేరా, రాజ కుమారుడు అనే రెండు తెలుగు చిత్రాలలో అలరించింది. ఆమె చివరిసారిగా 2018లో సన్నీ డియోల్‌కి జోడీగా’ భయాజీ సూపర్‌హిట్’ చిత్రంలో కనిపించింది. ఇంతకుముందు ‘కింగ్స్ ఎలెవన్ పంజాబ్’ అని పిలువబడే ఐపీఎల్ క్రికెట్ జట్టు ‘పంజాబ్ కింగ్స్’ని కూడా ఆమె సొంతం చేసుకుంది. ప్రీతి గత సంవత్సరం తన భర్త జీన్ గూడెనఫ్‌తో సరోగసీ ద్వారా కవలలను స్వాగతించింది.

 

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×