BigTV English

Russia Disagrees Ceasefire: అమెరికా ప్రతిపాదనలతో లాభం లేదు.. కాల్పుల విరమణపై రష్యా అనాసక్తి

Russia Disagrees Ceasefire: అమెరికా ప్రతిపాదనలతో లాభం లేదు.. కాల్పుల విరమణపై రష్యా అనాసక్తి

Russia Disagrees Ceasefire| రష్యా, ఉక్రెయిన్ ల మధ్య అమెరికా జరుపుతున్న శాంతి చర్చలు ఇప్పట్లో సఫలీకృతం అయ్యేటల్లు కనిపించడం లేదు. ‘మేమెందుకు వెనక్కి తగ్గాలి అంటే.. మేము కూడా వెనక్కి తగ్గేది లేదు’ అన్నట్లుగా ఉంది ఇరు దేశాలు మొండి వైఖరితో వ్యవహరిస్తున్నాయి. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుపుతున్నప్పటికీ అది కాస్తా విఫలయత్నంగానే మిగిలి ఉంది. ఒకవైపు వైట్ హౌస్ వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో జరిపిన చర్చలు వాగ్వాదానికి దారి తీశాయే తప్ప వాటిలో ఎటువంటి ముందడుగు పడలేదు. అదే సమయంలో రష్యాను కూడా కాస్త తగ్గే ఉండమని ట్రంప్ చేస్తున్న విజ్ఞప్తిని కూడా ఆ దేశం పెద్దగా పట్టించుకోవడం లేదు. 30 రోజుల కాల్పుల విరమణ పాటిస్తూ శాంతి ఒప్పందంతో ఇరు దేశాల మధ్య యుద్ధం ఓ కొలిక్కి వస్తుందని ఆశించిన అమెరికాకు రష్యా, ఉక్రెయిన్ల వైఖరి ఏ మాత్రం మింగుడు పడటం లేదు.


ఉక్రెయిన్ సైన్యానికి అనుకూలంగానే అమెరికా
రష్యా ఇదే విషయాన్ని తాజాగా అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఆడ్వైజర్ మికీ వాల్ట్ కు స్పష్టం చేసింది. “30 రోజుల కాల్పుల విరమణ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు” అని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అత్యంత కీలక విషయాలు చూసే యురీ ఉషాకోవ్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఫోన్ లో అమెరికాకు తేల్చిచెప్పారు.

‘మీరు కోరుకుంటున్నట్లు శాంతి ఒప్పందం (కాల‍్పుల విరమణ ఒప్పందం)తో ఎటువంటి ప్రయోజనం లేదు. అది కేవలం ఉక్రెయిన్ సైన్యం కాస్త ఊపిరి పీల్చుకోవడానికే పనికొస్తుంది. మేము కోరుకునేది శాశ్వత శాంతి ఒప్పందం. రష్యా చట్టబద్ధమైన ప్రయోజనాలను” కాపాడే దీర్ఘకాలిక శాంతియుత పరిష్కారం కోసం రష్యా లక్ష్యంగా పెట్టుకుంది. మా తాపత్రయం అంతా దానిపైనే ఉంది. అంతే తప్ప శాంతి ఒప్పందం పేరుతో 30 రోజుల కాల్పుల విరమణ వల్ల ఏ ఉపయోగం ఉండదు’ అని అమెరికాకు తేల్చిచెప్పారు. ఫలితంగా ఇరు దేశాల శాంతి ఒప్పందం మళ్లీ మొదటికొచ్చినట్లయ్యింది.


Also Read: ప్రపంచంలోనే టాప్ 10 సంపన్న దేశాలు

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో జెలెన్ స్కీ భేటీ తర్వాత కూడా ఉక్రెయిన్ పై రష్యా మళ్లీ దాడులు చేసింది. అదే సమయంలో ఆ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టిన ఉక్రెయిన్ సైతం తాము కూడా తాడో పేడో తేల్చుకుంటామనే రీతిలో యుద్ధ రంగంలోకి దూకింది. ఆ క్రమంలోనే రష్యాపై మెరుపు దాడి చేసింది. సుమారు 300 పైగా డ్రోన్ల సాయంతో రష్యాపై విరుచుకుపడింది. ఈ దాడితో ప్రాణనష్టం, ఆస్తినష్టం కూడా అధికంగా వాటిల్లినట్లు తెలుస్తున్నప్పటికీ, దానిపై రష్యా అధికారిక ప్రకటన ఏమీ చేయలేదు.

రష్యా డిమాండ్లు ఏంటి?..

ఉక్రెయిన్‌ యుద్ధం ముగించాలన్నా.. అమెరికాతో సంబంధాలు పునరుద్ధరించాలన్నా.. తీర్చాల్సిన డిమాండ్ల లిస్టును రష్యా బయటపెట్టింది. ఇటీవలే వాషింగ్టన్‌కు అందజేసింది. కాకపోతే ఆ డిమాండ్లు ఏమిటనేది మాత్రం బహిర్గతం చేయలేదు. గత మూడు వారాల నుంచి అమెరికా-రష్యా అధికారులు వర్చువల్‌ విధానంలో చర్చలు జరుపుతున్నారు. కాకపోతే మాస్కో పంపిన డిమాండ్లలో చాలావరకు గతంలో ఉక్రెయిన్‌కు అందించినవే ఉన్నట్లు తెలుస్తోంది. వీటిల్లో ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం ఇవ్వకపోవడం, విదేశీ దళాలను ఉక్రెయిన్‌లోకి అనుమతించకపోవడం, క్రిమియా, మరో నాలుగు ప్రావిన్స్‌లు రష్యాకు చెందుతాయని అంగీకరించడం వంటివి ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతోపాటు అసలు యుద్ధానికి మూలకారణమైన నాటో తూర్పువైపు విస్తరణ అంశం కూడా పరిశీలించాలని కోరే అవకాశం ఉంది.

తాజాగా ఈ అంశంపై బ్రూకింగ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఏంజెలా స్టెంట్‌ మాట్లాడుతూ డిమాండ్లలో ఎటువంటి మినహాయింపులు ఇచ్చేందుకు రష్యన్లు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోందన్నారు. గతంలో పలుమార్లు అమెరికా తిరస్కరించిన డిమాండ్లనే మళ్లీ చేస్తోంది. దీంతో మాస్కో శాంతి, అర్థవంతమైన చర్చలకు ఆసక్తిగా లేదని తెలుస్తోందన్నారు.

యుద్ధభూమిలో పుతిన్‌ పర్యటన

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తొలిసారిగా యుద్ధ భూమిలోకి అడుగుపెట్టారు. పశ్చిమ రష్యా (Russia)లోని కర్స్క్ లో బుధవారం ఆయన పర్యటించారు. ఉక్రెయిన్‌ దళాలు ఈ ప్రాంతంలోని కొంత భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాయి. అయితే రష్యా ప్రతిఘటిస్తున్న సమయంలో శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడే ఈ ప్రాంత పర్యటనకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. (Ukraine Russia War)

కర్స్క్ లోని రష్యా దళాల కంట్రోల్‌ సెంటర్‌కు ప్రెసిడెంట్ పుతిన్ వెళ్లారు. మిలిటరీ డ్రెస్సులో పుతిన్ పర్యటిస్తున్న దృశ్యాలను మీడియా ప్రసారం చేసింది. ఈ సందర్భంగా యుద్ధ భూమిలోని పరిస్థితులను పుతిన్‌ అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా ఈ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ దళాలను తరిమికొట్టాలని అధ్యక్షుడు ఆదేశించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఒప్పుకోకపోతే రష్యాకు తీవ్ర ఆర్థిక నష్టం: ట్రంప్‌
ఇదిలాఉండగా.. యుద్ధంలో 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్‌ (Ukraine) అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధులు రష్యా బయల్దేరారు. ఈ విషయాన్ని ట్రంప్‌ (Donald Trump) వైట్‌హౌస్‌ వద్ద మీడియా సమావేశంలో వెల్లడిస్తూ.. ‘‘మా ప్రతినిధులు రష్యాకు బయల్దేరారు. కాల్పుల విరమణకు పుతిన్‌ అంగీకరిస్తారనే ఆశిస్తున్నాం. లేకపోతే యుద్ధంతో పాటు రష్యా ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది రష్యాకే వినాశకరంగా మారుతుంది. అలాంటి ఫలితాన్ని నేను కోరుకోవట్లేదు. శాంతిని సాధించడమే నా లక్ష్యం’’ అని ట్రంప్‌ వివరించారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×