OTT Movie : ఎంటర్టైన్మెంట్ కి ఓటిటి ప్లాట్ ఫామ్ అడ్డాగా మారిపోయింది. సమయం దొరికినప్పుడు వీటినే ఎక్కువగా చూస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా ఎన్నో రకాల సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులని అలరిస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, ఒక జంట పంది మాంసం అని చెప్పి, మనిషి మాంసాన్ని అమ్ముతూ ఉంటారు. వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారనే విషయం స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘సమ్ లైక్ ఇట్ రేర్’ (Some like it rare). 2021 లో వచ్చిన ఈ ఫ్రెంచ్ థ్రిల్లర్ మూవీకి ఫాబ్రిస్ ఎబౌయే దర్శకత్వం వహించారు. ఇందులో మెరీనా ఫోయిస్, ఎబౌ ప్రధాన పాత్రల్లో నటించారు. శాకాహారాన్ని ఆచరించే వారి మాంసాన్ని “పంది మాంసం” అని లేబుల్ చేసి ఒక జంట అమ్ముతుంటారు. ఇందుకోసం ఈ జంట మనుషులను కూడా చంపుతూ ఉంటారు. అందులోనూ శాఖాహారం టినే మనుషుల మాంసం టేస్ట్ గా ఉంటుందనేది ఈ జంట అభిప్రాయం. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
భార్య భర్తలుగా ఉన్న విన్సెంట్, సోఫియా ఒక మీట్ షాప్ ను నడుపుతుంటారు. అయితే వీళ్ళ షాపు చాలా డల్ గా నడుస్తూ ఉంటుంది. ఒకానొక సమయంలో విన్సెంట్ ని వదిలి వెళ్ళిపోవాలనుకుంటుంది సోఫియా. వీళ్ళు ఆర్థికంగా కూడా బాగా వీక్ గా ఉంటారు. అప్పులు కూడా ఎలా కట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ సమయంలో అనుకోకుండా వీళ్ళ కారు, ఒక వ్యక్తిని గుద్దుతుంది. అతడు ఆ ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోతాడు. పోలీసులకు విషయం తెలిస్తే అరెస్ట్ చేస్తారని, అతని బాడీని మీట్ షాప్ లో పెట్టి ముక్కలు చేస్తారు. అలా ఒక మొక్క ఒక కస్టమర్ కి వెళుతుంది. టేస్ట్ బాగుందని మళ్లీ మాంసాన్ని కొనుక్కోవడానికి వస్తుంది. అలా వీళ్ళు మనిషి మాంసాన్ని, పంది మాంసంలో కలిపి అమ్ముతూ ఉంటారు. కొద్ది రోజుల్లోనే షాపు ఫేమస్ అవుతుంది.
అయితే శాఖాహారం తినే వాళ్ళని చంపి, వాళ్ళ మాంసాన్ని పంది మాంసంలో కలపాలని హత్యలు చేయడం మొదలు పెడతారు. అయితే విన్సెంట్ కాస్త సున్నిత మనస్తత్వం కలవాడు. సోఫియా క్రైమ్ స్టోరీలు చూసి కరుడు కట్టి పోయి ఉంటుంది. అతన్ని రెచ్చగొట్టి హత్యలు చేపిస్తుంది. చివరికి ఈ విషయం బయట పడుతుందా ? ఈ జంట పోలీసులకు దొరుకుతారా? మరి ఏమైనా సమస్యలు వస్తాయా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సమ్ లైక్ ఇట్ రేర్’ (Some like it rare) అనే ఈ మూవీని చూడండి.