Sarah McBride Transgender | డెమొక్రాట్స్ నాయకురాలు సారా మెక్‌బ్రైడ్ అమెరికాలోని డెలావేర్ రాష్ట్రం నుంచి ఎన్నికల్లో విజయం సాధించారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో డెలావేర్ నుంచి సెనేటర్ గా ఆమె గెలుపొందారు. అయితే సారా మెక్‌బ్రైడ్ ఒక ట్రాన్స్ జెండర్ మహిళ కావడం విశేషం. దీంతో ఒక ట్రాన్స్ జెండర్ మహిళ అమెరికన్ కాంగ్రెస్ (హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్) లో సెనేటర్ సీట్లు కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి.
డెలవేర్ ఎన్నికల్లో ఆమె తన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ సభ్యుడు జాన్ వాలెన్ 3 పై సునాయసంగా గెలుపొందారు. డెమోక్రాట్ అభ్యర్థి అయిన సారా మెక్‌బ్రైడ్ డెలావేర్ ఓటర్లలో 66 శాతానికి పైగా మద్దతుగా నిలిచారని యుస్ న్యూ నెట్ వర్క్ తెలిపింది. ఎన్నికల్లో విజయం సాధించడంపై సారా మెక్‌బ్రైడ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. “డెలావేర్ ప్రజలు ఎన్నికల్లో స్పష్టమైన తీర్పునిచ్చారు. ఈ దేశంలో అతిప్రజాస్వామ్యం ఉంది. ఈ ప్రజాస్వామ్యం అందరిదీ. స్వాతంత్ర్యాన్ని కాపాడే దేశం అమెరికా అని మరోసారి రుజువైంది.” అని తన పోస్ట్ లో ఆమె రాశారు.
ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే.. చిన్నపిల్లల వైద్యం ఖర్చు తగ్గిస్తానని, కుటుంబం, వైద్యం కోసం పెయిడ్ లీవ్, వైద్యం ఖర్చులు పరిమితిలోనే ఉంటాయని హామీలు ఇచ్చింది. అమెరికా ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ వ్యక్తుల హక్కులపై తీవ్రంగా చర్చలు జరిగాయి. లింగమార్పిడి చేసుకున్న వ్యక్తులకు క్రీడల్లో అనుమతి, టీనేజ్ ట్రాన్స్‌జెండర్ల సంరక్షణ అంశాలు వివాదాస్పపదంగా మారాయి.
Also Read: ‘ఎక్కువ కాలం బతకడు.. త్వరలోనే లేపేస్తాం’.. హిజ్బుల్లా కొత్త నాయకుడిపై ఇజ్రాయెల్ వ్యాఖ్యలు
“ఒకవైపు డెమెక్రాట్స్ ట్రాన్స్ జెండర్ వ్యక్తుల హక్కుల కోసం పోరాడుతుంటే.. రిపబ్లికన్స్ మాత్రం రాజకీయ లబ్ది కోసం మహిళ హక్కుల పేరుతో ట్రాన్స్ జెండర్ మహిళలకు ప్రత్యేక బాత్రూమ్స్, జైళ్లు, క్రీడల్లో పోటీలకు అనుమతి ఇవ్వకూడదని చెబుతున్నాయి.” అని సారా మెక్‌బ్రైడ్ రిపబ్లికన్ పార్టీపై విమర్శలు చేశారు.
సారా మెక్‌బ్రైడ్ విజయంపై అమెరికాలోని ఎల్‌జిటిక్యూ+ విక్టరీ ఫండ్ సంస్థ శుభాకాంక్షలు తెలిపింది. అమెరికా ఎన్నికల్లో ఆమె రికార్డు సృష్టించిందని ప్రశంసించింది. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ కోసం, తన లాంటి చాలా మంది మహిళ కోసం సారా మెక్‌బ్రైడ్ నిరంతరంగా పోరాడుతున్నారని, ఆమె విజయం సాధించడం పరిణామమని ఎల్‌జిటిక్యూ+ విక్టరీ ఫండ్ అధికారికంగా ప్రకటించింది.
పురుషుడిగా జన్మించిన సారా మెక్‌బ్రైడ్ ఆ తరువాత లింగమార్పిడి చేసుకొని మహిళగా మారారు. 2014లో ఆమె తన స్నేహితుడు ఆండ్రూ గ్రేని వివాహం చేసుకున్నారు. కానీ వివాహం జరిగిన 4 నెలలకే క్యాన్సర్ తో పోరాడుతూ ఆమె భర్త చనిపోయారు.
అమెరికా ఎన్నికల్లో మొత్తం 62 మంది ట్రాన్స్ జెండర్ అభ్యర్థులు పోటీ చేశారు. 2020 ఎన్నికల్లో ఈ సంఖ్యలో 34 ఉండగా.. ఈసారి అది దాదాపు రెండింతలు కావడం గమనార్హం. ట్రాన్స్ జెండర్ గా పోటీచేసిన వారిలో స్పానిష్ టీచర్ మెల్ మాన్యుయెల్ కూడా ఉన్నారు. ఆమెకు 49 శాతం ఓట్లు లభించాయి. కానీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి స్టీవ్ స్కేలైజ్ ఆమెను ఓడించారు.
మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖరారుగా కనిపిస్తోంది. దేశంలోని కీలక అతిపెద్ద 7 రాష్ట్రాలలో ట్రంప్ రెండు రాష్ట్రాలు జార్జియా, నార్త్ కెరోలినా లో విజయం సాధించారు. మరో 4 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ లో ముందంజలో ఉన్నారు.