BigTV English

Vijay Devarakonda: వారితో కలిసి విజయ్ దేవరకొండ ప్రత్యేక పూజలు.. దానికోసమేనా.. ?

Vijay Devarakonda: వారితో కలిసి విజయ్ దేవరకొండ ప్రత్యేక పూజలు.. దానికోసమేనా.. ?


Vijay Devarakonda: పెళ్లి చూపులు సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరోగా మారిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమా ఏమో కానీ.. ఆ సమయంలో విజయ్ మాట్లాడిన మాటలు ఎంతోమందిని ప్రభావితం చేసాయి. కుర్రకారుకు విజయ్ ను ఒక ఐకాన్ గా మార్చాయి. ఇక విజయ్ సైతం మంచి మంచి కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ అంటే లైగర్. ఈ సినిమాపై ఎన్నో అంచనాలను పెట్టుకున్న అభిమానులు.. థియేటర్ కు వెళ్లి నీరసమై నీరుగారిపోయి బయటికి వచ్చారు. విజయ్ కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయ్యిపోయింది అంటే అది ఈ సినిమా తరువాతనే.

ఇక ఆ పెద్ద ప్లాప్ నుంచి బయటపడడానికి రౌడీ హీరో చాలా ట్రై చేస్తున్నాడు. అందులో భాగంగానే ఖుషి సినిమా ఒప్పుకున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం, సమంత హీరోయిన్ కావడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు బాగానే పెరిగాయి. కానీ, ఇది కూడా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. అపజయాల గురించి ఆలోచించకుండా విజయం కోసం కష్టపడాలి అన్న చందాన.. రౌడీ హీరో ఈసారి ఫ్యామిలీ స్టార్ గా మారాడు. తనకు అచ్చొచ్చిన కాంబోను రిపీట్ చేశాడు. గీతగోవిందం లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ పరుశురాం తో రెండోసారి జతకట్టి ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.


నిజం చెప్పాలంటే ఈసారి విజయ్ కు హిట్ చాలా అవసరం. చాలా ఏళ్లుగా విజయ్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తూనే వస్తున్నాడు. ఫ్యాన్స్ .. విజయ్ హిట్ కొడతాడని నమ్మకంగా కూడా ఉన్నారు. దీంతో ఈసారి రిస్క్ తీసుకోకుండా తన కష్టంతో పాటు దేవుడు ఆశీర్వాదాలు కూడా ఉంటే మంచిది  అనుకోని హోమాలు చేస్తున్నాడు. దిల్ రాజు ఆఫీస్ లో ది ఫ్యామిలీ స్టార్ చిత్రబృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.  ఈ పూజలో దిల్ రాజు, డైరెక్టర్ పరుశురామ్, విజయ్ దేవరకొండ, దిల్ రాజు తమ్ముడు శిరీష్ పాల్గొన్నారు. మరి ఈ పూజా ఫలితంగా ది ఫ్యామిలీ స్టార్ హిట్ అవుతుందో లేదో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×